Share News

Encounter: నివురు గప్పిన నిప్పులా భద్రాద్రి ఏజెన్సీ

ABN , Publish Date - Sep 26 , 2024 | 08:15 AM

ఆపరేషన్ కగార్‌లో భాగంగా భారీగా కూంబింగ్ సాగుతున్నా.. పూసుగుప్ప క్యాంప్‌పై మావోయిస్టుల దాడితో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. సుమారు అరగంట పాటు మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అయితే ప్రాణ నష్టంపై పోలీస్ అధికారులు, మావోయిస్ట్ పార్టీ ఎలాంటి అధికారక ప్రకటన చేయలేదు.

Encounter: నివురు గప్పిన నిప్పులా భద్రాద్రి ఏజెన్సీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి ఏజెన్సీ (Bhadradri Agency) నివురు గప్పిన నిప్పులా ఉంది. ఛత్తీస్‌గడ్ (Chhattisgarh) ధర్మారం క్యాంప్‌కు రెండు కిలో మీటర్ల దూరంలో చర్ల మండలం, పూసుగుప్ప సీఅర్‌ఫీఎఫ్ (CRPF) క్యాంప్‌పై బుధవారం రాత్రి మావోయిస్టుల మెరుపు దాడి చేశారు. దీంతో తెలంగాణ పోలీసులు ఉలిక్కిపడ్డారు. సెప్టెంబర్ 5 న కరకగూడెం ఎన్ కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టులు తెలంగాణ లో అడుగు పెట్టకుండా తెలంగాణ పోలీసు (Telangana Police) హెచ్చరికలు చేశారు.


ఆపరేషన్ కగార్‌లో భాగంగా భారీగా కూంబింగ్ సాగుతున్నా.. పూసుగుప్ప క్యాంప్‌పై మావోయిస్టుల దాడితో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. సుమారు అరగంట పాటు మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అయితే ప్రాణ నష్టంపై పోలీస్ అధికారులు, మావోయిస్ట్ (Maoists) పార్టీ ఎలాంటి అధికారక ప్రకటన చేయలేదు. కాగా చర్ల మండలం హై అలర్ట్ జోన్‌గా మారింది. భారీగా కూంబింగ్ (Combing) కొనసాగుతోంది.


కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని పూసుగుప్ప సీఅర్‌ఫీఎఫ్ బేస్‌ క్యాంపుపై మావోయిస్టులు బుధవారం రాత్రి కాల్పులకు దిగారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ ధర్మారం క్యాంప్‌కు రెండు కిలో మీటర్ల దూరంలో చర్ల మండలం, పూసుగుప్ప శివారులో ఉన్న ఈ క్యాంపుపై మావోయిస్టులు సమీప అడవుల్లో నుంచి కాల్పులు జరిపారు. దీన్ని భద్రతా బలగాలు దీటుగా ఎదుర్కొన్నాయి. ఆవిర్భావ ఉత్సవాలకు మావోయిస్టు పార్టీ ఇటీవల పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మావోయిస్టులు పూసుగుప్ప సీఅర్‌ఫీఎఫ్ బేస్‌ క్యాంపుపై మెరుపుదాడికి పాల్పడ్డారు.


కాగా గత నెల ఆగస్టు 24న సాక్షాత్తు దేశ హోంమంత్రి అమిత్‌షా మార్చి 2026 నాటికి మావోయిస్టు కార్యకలాపాలు నిర్మూలిస్తామని, మావోయిస్టులకు వ్యతిరేకంగా నిర్దాక్షిణ్య వ్యూహాన్ని అవలంబిస్తామని రాయ్‌పూర్‌లో ప్రకటించారు. ఆ ప్రేరణతోనే ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ సరిహద్దులో 2024 సెప్టెంబర్‌ 3న ఎన్‌కౌంటర్‌గా చెప్పబడుతున్న ఘటనలో తొమ్మిది మంది మావోయిస్టులను చంపారు. వెనువెంటనే సెప్టెంబర్‌ 5న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం పరిధిలో ఆరుగురు మావోయిస్టులు పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. మొత్తంగా ఒక్క 2024లోనే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోనే 136 మంది మావోయిస్టులు చంపబడ్డారు. సేఫ్‌ జోన్‌గా భావించి అటు నుండి వచ్చి తెలంగాణలోని భద్రాద్రి ప్రాంతంలో తలదాచుకుంటున్న వారిని నిర్మూలించే కార్యక్రమంలో భాగమే కరకగూడెంలో జరిగిన ఎన్‌కౌంటర్‌.

రాజ్యహింసలో భాగంగా అది ఏ ప్రభుత్వమైన గానీ 1996 నుంచి 2018 వరకు దాదాపు 15 వేల మంది మావోయిస్టులను హతం చేశారు. ఈ కాలంలో నక్సల్‌ దాడుల వలన కానీ, పోలీసుల పొరపాట్లవల్ల కానీ దాదాపు 4000 మంది సామాన్య పౌరులు మరణించారు. నక్సల్స్‌ అయినా, సామాన్యులైనా మరణించిన వేలాది మంది మృతులు, హతులలో ఎక్కువ భాగం పేద, దళిత, ఆదివాసియులు ఉన్నారనే విషయం గమనార్హం.


ఈ వార్తలు కూడా చదవండి..

రెండు వేర్వేరు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు..

మక్కెలు విరగ్గొడతాం

పెళ్లి పేరుతో రేప్‌.. హత్య..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 26 , 2024 | 08:15 AM