Home » Bhatti Vikramarka Mallu
తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చుతున్నారని విమర్శలు చేస్తున్న బీఆర్‌ఎస్ నేతలు.. గత పదేళ్లు అధికారంలో ఉండి అధికారికంగా విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
తెలంగాణ తల్లి విగ్రహం.. తెలంగాణ ప్రజల మనోభావాలకు అద్దం పడుతుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. విగ్రహ ఆవిష్కరణ పండుగ.. ప్రజల గుండెల్లో మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందన్నారు.
సంక్రాంతి తర్వాత రైతు భరోసా పథకాన్ని పక్కాగా అమలు చేసి తీరుతామని, ఇందుకు కావాల్సిన నిధులు సమకూర్చుకుంటున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అప్పులకు అదనపు ఆదాయం కలిపి బ్యాంకులకు కట్టే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు రూ.61 వేల కోట్లు వెచ్చించామని తెలిపారు.
గత ఏడాది కాలంగా రాష్ట్రంలో దొరల ప్రభుత్వం కాదు.. ప్రజల ప్రభుత్వం నడుస్తోంది. కానీ, బీఆర్‌ఎస్ పార్టీ మాత్రం ‘ప్రజల వద్దకు పోతాం.. ఉద్యమం చేస్తాం.. నిలదీస్తాం’ అంటూ రకరకాల ప్రకటనలు చేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్‌నగర్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన రైతు పండగ విజయవంతమైంది. తొలి రెండ్రోజులు రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.
రాష్ట్రంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భ్రమల్లో బతుకుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. కాంగ్రె్‌సను కూకటి వేళ్లతో సహా పెకిలించడం ఎవరి తరమూ కాదన్నారు.
సమగ్ర కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుందని, ఆన్‌లైన్‌లో వివరాల నమోదు చాలా ముఖ్యమైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఏ పొరపాట్లకు అవకాశం లేకుండా వివరాలను నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఝార్ఖండ్ రాష్ట్ర ఎన్నికల్లో ఇండి కూటమి సమష్టి కృషి వల్లే విజయం సాధించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బీజేపీ తలకిందులుగా తపస్సు చేసినా విజయం సాధించలేకపోయిందని పేర్కొన్నారు.