Home » Bihar
ప్రాచీన భారతదేశంలోని మొట్టమొదటి సామ్రాజ్యం మగధ..! అతి పెద్ద విశ్వవిద్యాలయం నలందా..! షోడశజనపదాలు మొదలు.. మౌర్యులు.. ఆ తర్వాతి రాజ వంశాలు ఏలిన ప్రదేశాల్లో మగధతోపాటు..
ఓ మహిళకు కాంపౌండర్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశాడు. దాంతో ఆమె మరణించింది. ఆసుపత్రి వద్ద మృతదేహంతో ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
విపక్ష పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA) వ్యతిరేకిస్తున్న వారు ఒక విషయం తెలుసుకోవాలని, సీఏఏ అమలు విషయంలో తాను ఎంతమాత్రం భయపడేది లేదని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పారు.
ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్, కుమార్తె మీసా భారతిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారంనాడు పవర్ఫుల్ పంచ్‌లు విసిరారు. జైలులో ఉన్నవాళ్లు, బెయిలుపై బయటకు వచ్చిన వాళ్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని జైలుకు పంపతామని అంటున్నారని మిసా భారతిపై మండిపడ్డారు. మీరు ఏదైనా తినండి కానీ ప్రదర్శన ఎందుకని తేజస్విని నిలదీశారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉన్న బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ లంచ్ బ్రేక్‌లో చేపకూరతో భోజనం తీసుకోవడం, ఆయనే స్వయంగా ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేయడం సోషల్ మీడియోలో వైరల్ అయింది. దీనిపై బీజేపీ విమర్శలు గుప్పించగా, మీ 'ఐక్యూ' ఇంతేనా అంటూ తేజస్వి కౌంటర్ ఇచ్చారు.
రాష్ట్రీయ్ జనతాదల్ అధినేత లాలు ప్రసాద్ యాదవ్‌పై భారతీయ జనతా పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఆయనకు కుటుంబ సభ్యులే ముఖ్యం అని మండిపడింది. లోక్ సభ ఎన్నికల తొలి జాబితాను ఆర్జేడీ విడుదల చేసింది. అందులో లాలు ఇద్దరు కూతుళ్లకు టికెట్ దక్కింది. దాంతో లాలు ప్రసాద్ యాదవ్ లక్ష్యంగా బీజేపీ విమర్శలు చేసింది.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను రద్దు చేయడంపై మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తప్పుపట్టారు. బీహార్‌లోని నవడాలో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, జమ్మూకశ్మీర్ భారత్‌లో భాగం కాదా అని ప్రశ్నించారు.
బీహార్ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పట్టుదలగా ఉన్న రాష్ట్రీయ జనతా దళ్ మరో పార్టీతో శుక్రవారంనాడు చేతులు కలిపింది. ముఖేష్ సహనీ సారథ్యంలోని వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా ఆ పార్టీకి 3 సీట్లు కేటాయించింది. రెండు పార్టీల నేతలు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
బీజేపీ సీనియర్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ(Sushil Kumar Modi) క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. బుధవారం ఆయన ఎక్స్‌లోని ఓ పోస్ట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.
లోక్‌సభ ఎన్నికల వేళ బీహార్‌లోని ముజఫర్‌పూర్ బీజేపీ ఎంపీ అజయ్ నిషాద్ ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీకి చెందిన అన్ని పదవులు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన నిషాద్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరారు.