Share News

Rajanth Vs Tejashwi: చేపలు, ఏనుగులు, గుర్రాలను కూడా తినండి.. రాజ్‌నాథ్ పవర్ పంచ్

ABN , Publish Date - Apr 14 , 2024 | 04:57 PM

ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్, కుమార్తె మీసా భారతిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారంనాడు పవర్‌ఫుల్ పంచ్‌లు విసిరారు. జైలులో ఉన్నవాళ్లు, బెయిలుపై బయటకు వచ్చిన వాళ్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని జైలుకు పంపతామని అంటున్నారని మిసా భారతిపై మండిపడ్డారు. మీరు ఏదైనా తినండి కానీ ప్రదర్శన ఎందుకని తేజస్విని నిలదీశారు.

Rajanth Vs Tejashwi: చేపలు, ఏనుగులు, గుర్రాలను కూడా తినండి.. రాజ్‌నాథ్ పవర్ పంచ్

పాట్నా: ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ (Tejaswi Yadav), కుమార్తె మీసా భారతి (Misha Bharti)పై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) ఆదివారంనాడు పవర్‌ఫుల్ పంచ్‌లు విసిరారు. జైలులో ఉన్నవాళ్లు, బెయిలుపై బయటకు వచ్చిన వాళ్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని జైలుకు పంపతామని అంటున్నారని మిసా భారతిపై మండిపడ్డారు. ఆర్జేడీ నేతలు కొందరు నవరాత్రి సీజన్‌లో ఒక వర్గం ఓటర్లను ఆకట్టుకునేందుకు నాన్‌వెజిటేరియన్ విజువల్స్ పోస్టింగ్ చేస్తున్నారని విమర్శించారు.


''మీరు (తేజస్వి) నవరాత్రి సీజన్‌లో చేపలు తిన్నారు. వాటిని పోస్ట్ చేయడం ద్వారా ఎలాంటి సందేశం ఇవ్వదలచుకున్నారు? చేప, పంది, పావురం, ఏనుగు, గుర్రం ఏదైనా తినండి? వాటిని అందరికీ ప్రదర్శించాల్సిన అవసరం ఏముంది? ఇది ఓట్ల కోసం, బుజ్జగింపు రాజకీయాల కోసం చేస్తున్నదే. ఫలానా మతానికి చెందిన వారు ఓట్లు వేస్తారనే ఆలోచనే ఇందుకు కారణం. ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులను సరిదిద్దాలని లాలూజీకి విజ్ఞప్తి చేస్తు్న్నాను'' అని రాజ్‌నాథ్ బీహార్‌లోని జముయిలో జరిగిన పార్టీ మీటింగ్‌లో మాట్లాడుతూ అన్నారు. మోదీ మూడోసారి ప్రధాని అవుతున్నారని ప్రపంచమంతా చెబుతోందని, అనేక దేశాల నుంచి మోదీకి ఆహ్వానాలు కూడా మొదలయ్యాయని చెప్పారు.

Lok Sabha polls 2024: రాహుల్‌ను 'మెజీషియన్'తో పోల్చిన మోదీ


తేజస్వి, మీసా భారతి యాదవ్ ఏమన్నారు?

ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న తేజస్వి యాదవ్ ఇటీవల లంచ్ బ్రేక్ సమయంలో చేపల ఆహారం తింటున్న వీడియోను పోస్ట్ చేశారు. నవరాత్రి ప్రారంభమైన తర్వాత ఆయన వీడియో విడుదల చేయడంతో బీజేపీ తప్పుపట్టింది. సనాతన ధర్మాన్ని పాటిస్తానని చెప్పుకునే తేజస్వి బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ విమర్శించింది. దీనికి తేజస్వి వెంటనే స్పందించారు. నవరాత్రులు మొదలు కాకముందు తీసిన వీడియో ఇదని, తేదీ కూడా వీడియోపై చూసుకోండని అన్నారు. బీజేపీ, గోడి మీడియా అనుచరుల 'ఐక్యూ'ను పరీక్షించేందుకే వీడియో పోస్ట్ చేశానని, తాను అనుకున్నదే కరెక్టని నిరూపణ అయిందని ఆయన కౌంటర్ ఇచ్చారు. కాగా, ప్రజలు రాబోయే ఎన్నికల్లో 'ఇండియా' కూటమికి ఒక అవకాశం ఇస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా బీజేపీ నేతలందిరినీ జైళ్లలో పెట్టిస్తామని ఇటీవల మీడియాతో మాట్లాడుతూ మిసా భారతి వ్యాఖ్యానించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 14 , 2024 | 04:57 PM