Home » BJP
రాష్ట్రం నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థులు ఖరారయ్యారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఆధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య ఈ ఆసక్తికర పోస్టర్ వార్ చోటుచేసుకుంది. 'పుష్ప 2' చిత్రంలోని పాపులర్ డైలాగ్ 'తగ్గేదేలే' అంటూ కేజ్రీవాల్ పార్టీ గుర్తు 'చీపురు' చేత పట్టుకున్న పోస్టర్‌ను ఆప్ విడుదల చేసింది.
ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన ఎమ్మెల్యే ఉదయ్ సామంత్, ఎన్సీపీ నేత దిలీప్ వాల్సే పాటిల్, బీజేపీ నేత సంజయ్ కుటే తదితరులు అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
సభ ప్రారంభంకాగానే కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అసెంబ్లీలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సీటులో కూర్చున్నారు. విషయాన్ని గుర్తించిన మరోమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన కిందకు వస్తుందని, మీకు ఏదైనా సమస్య ఉంటే సభ దృష్టికి తీసుకురావాలని..
ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలకు తగిన గౌరవం లభించడంలేదన్నారు. దక్షిణ తెలంగాణకు పూర్తి అన్యాయం జరుగుతోందని, తమ నియోజకవర్గాల అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తన ఐడి కార్డును చూపిస్తూ.. ఈ కార్డుకు విలువలేకుండా పోయిందని..
పేదల బియ్యం దోపిడీ పైన “సిట్“ అనగానే కలుగులో ఉన్న అవినీతిపరులు స్టాండ్, అటెన్షన్ అండ్ రన్ అనే పరిస్థితికి వచ్చారని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు కేవలం పేదలకు ఉచిత బియ్యం కోసం సంవత్సరానికి సగటున రూ.16 వేల కోట్లు వెచ్చిస్తున్న నిధులు దుర్వినియోగం కావడం బాధాకరమని తెలిపారు.
ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరారు. దీంతో ఆయనకు బంపర్ ఆఫర్ ఇచ్చింది బీజేపీ. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
బీదర్‌లో నిర్వహిస్తున్న హిందూ జాగృతి సభకు హైదరాబాద్‌కు చెందిన బీజేపీ మహిళానేత మాధవీలత, శ్రీరామసేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్, కాజల్ హిందూస్తానీ హాజరుకాకుండా జిల్లాలోకి వారి ప్రవేశాన్ని నిషేధిస్తూ అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.
ప్రతిపక్షాలు ఇచ్చింది చార్జ్‌షీట్ కాదని, దాన్ని రిప్రజంటేషన్‌గా తాము భావిస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
రాష్ట్ర క్యాబినెట్లో అర్బన్ నక్సలైట్లు ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అనడంలో ఆంతర్యమేమిటని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రశ్నించారు.