Home » BJP
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై సోషల్ మీడియాలో ఆరోపణల నేపథ్యంలో బీజేపీ నేత చల్లా నారాయణరెడ్డిపై ఆదివారం కేసు నమోదైందని భూపాలపల్లి జిల్లా కాటారం ఎస్సై అభినవ్ తెలిపారు.
ఝార్ఖండ్ ప్రజలపై బీజేపీకి ప్రేమ లేదని, ఇక్కడి అపార ఖనిజ సంపదపైన ఆ పార్టీ కన్నేసిందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
ఫొటో షూట్ కోసమే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మూసీ నిద్రకు వెళ్లారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. మూసీ పరీవాహక ప్రాంతంలో 3 నెలలుంటే అక్కడి సమస్యలు తెలుస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి అంటే.. 12 గంటల ఉండి ఫొటో షూట్ చేసుకుని వచ్చారన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కమల దళం రక్షణ కవచంలా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. లగచర్ల ఘటనను పక్కదారి పట్టించేందుకే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మూసీ నిద్ర అంటున్నారని తెలిపారు.
దేశంలో బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్ రాజకీయంగా ప్రమాదకరమైనవని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దేశ వాణిజ్య రాజధాని ముంబై అన్ని పార్టీలకూ కీలకం కానుంది.
2023 నుంచి మణిపూర్‌లో మైతెయి, కుకీ జాతుల మధ్య అల్లర్లు చెలరేగాయి. నాటి నుంచి నేటి వరకు 250 మందికి పైగా మరణించారు. 60 వేల మంది ప్రజలు మణిపూర్ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిపోయారు.
లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉండటంతో 'ఇండిపెండెన్స్ డే' సందర్భంగా త్రివర్ణ పతాకం ఎవరు ఎగుర వేయాలనే దానిపై పరిశీలన జరిగింది. అప్పటి ఢిల్లీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న అతిషిని త్రివర్ణ పతాకం ఎగురవేయాలని కేజ్రీవాల్ ఆదేశించారు.
కిరారీ అసెంబ్లీ నియోజకవర్గంలో కింద స్థాయి కార్యకర్తల్లోనూ గట్టిపట్టు ఉన్న అనిల్ ఝా కొద్దికాలంలో పార్టీ నాయకత్వం, విధానాలపై అసంతృప్తితో ఉన్నారు. తాజాగా ఆయన పార్టీ మారడం ద్వారా బీజేపీకి సంప్రదాయబద్ధంగా గట్టి పట్టున్న కిరారీలో ఆప్‌కు లబ్ధి చూకూరే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఢిల్లీలో సెటిల్మెంట్ చేసుకోవడంతో మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ కథ కంచికి పోయిందిని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఈ ఫార్ములా, ధరణి స్కాం కేసులన్నీ గాలికే పోయాయని విమర్శలు చేశారు.