Share News

Today Breaking News: నేటి తాజా వార్తలు..

ABN , First Publish Date - Dec 27 , 2024 | 11:03 AM

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Today Breaking News: నేటి తాజా వార్తలు..
Breaking News

Live News & Update

  • 2024-12-27T14:14:13+05:30

    శనివారం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు..

    • ఢిల్లీ: శనివారం నాడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

    • ప్రజల సందర్శనార్థం శనివారం ఉదయం ఏఐసిసి కార్యాలయానికి మన్మోహన్ భౌతికకాయం.

    • శనివారం ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు ఏఐసీసీలో పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం మన్మోహన్ సింగ్ పార్థీవదేహాన్ని ఉంచుతారు.

    • 9:30కి ఏఐసిసి కార్యాలయం నుంచి రాజ్ ఘాట్ వరకు మన్మోహన్ అంతిమయాత్ర నిర్వహిస్తారు.

    • రాజ్ ఘాట్ సమీపంలో మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

  • 2024-12-27T12:26:49+05:30

    BIG NEWS: వర్చువల్‌ విధానంలో నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్

  • 2024-12-27T12:26:48+05:30

    • మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్దివ దేహానికి నివాళులర్పించిన ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ

    • మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే సోనియా,రాహుల్, ప్రియాంక గాంధీ

    Rahul-Gandhi,-Sonia-Gandhi-.jpg

  • 2024-12-27T12:07:50+05:30

    • మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్దివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

    • మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

  • 2024-12-27T12:00:34+05:30

    • నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌

    • సంధ్య థియేటర్ ఘటనలో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు

    • బెయిల్‌ పిటిషన్ దాఖలు చేసిన అల్లు అర్జున్ లాయర్లు

    • ఇదే కేసులో మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన హైకోర్టు

    • నేటితో ముగియనున్న అల్లు అర్జున్‌ రిమాండ్‌ గడువు

    • వర్చువల్‌గా కోర్టుకు హాజరుకానున్న అల్లు అర్జున్‌

  • 2024-12-27T11:58:49+05:30

    • న్యాయ స్థానం ముందు అల్లు అర్జున్ వర్చ్యువల్ హాజరుకు అనుమతించిన న్యాయ స్థానం

  • 2024-12-27T11:58:48+05:30

    • డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు - మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

    • మన్మోహన్ సింగ్ మృతి వ్యక్తిగతంగా నాకు కూడా లోటు - మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

    • మర్యాదకు నిదర్శనం మన్మోహన్ సింగ్... -మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

    • ఆయన భారత ఆర్థిక వ్యవస్థకు రూపశిల్పి అని నేను నమ్ముతున్నాను...- మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

  • 2024-12-27T11:21:53+05:30

    RSS: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ సంతాపం

    దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం (డిసెంబర్ 26, 2024) ఢిల్లీ ఎయిమ్స్‌లో తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలతోపాటు ప్రతిపక్షాలు కూడా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ ప్రధాని మృతి పట్ల ఆర్‌ఎస్‌ఎస్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ సంతాపం వ్యక్తం చేశారు. భారత మాజీ ప్రధాని, దేశ సీనియర్ నేత డాక్టర్ సర్దార్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల యావత్ దేశం తీవ్ర విషాదంలో మునిగిపోయిందని పేర్కొన్నారు.

  • 2024-12-27T11:03:54+05:30

    మన్మోహన్‌ నివాసానికి చేరుకున్న రాహుల్ గాంధీ

    • మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్దివ దేహానికి నివాళులర్పించిన లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ

    • మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించి సోనియాగాంధీ