Kishan Reddy: బాలల దినోత్సవాన్ని నవంబరు14న జరపడమేంటి? బాలల దినోత్సవాన్ని నవంబరు14న జరపడమేంటి?
ABN , Publish Date - Dec 27 , 2024 | 03:49 AM
దేశంలో బాలల దినోత్సవాన్ని నెహ్రూ పుట్టినరోజైన నవంబరు 14న జరపడం సరైంది కాదని, మూడున్నర శతాబ్దాల క్రితం ధర్మం కోసం గురుగోవింద్ సింగ్ పిల్లలు బాబా జోరావర్‌సింగ్, బాబా ఫతేసింగ్ ప్రాణత్యాగం చేసిన డిసెంబరు 26న నిర్వహించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
పాఠ్యాంశంగా ‘వీర్ బాల్ దివస్’: కిషన్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): దేశంలో బాలల దినోత్సవాన్ని నెహ్రూ పుట్టినరోజైన నవంబరు 14న జరపడం సరైంది కాదని, మూడున్నర శతాబ్దాల క్రితం ధర్మం కోసం గురుగోవింద్ సింగ్ పిల్లలు బాబా జోరావర్‌సింగ్, బాబా ఫతేసింగ్ ప్రాణత్యాగం చేసిన డిసెంబరు 26న నిర్వహించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కిషన్‌రెడ్డి బాబా జోరావర్‌సింగ్, బాబా ఫతేసింగ్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రధాని మోదీ సూచనల మేరకు డిసెంబరు 26ను వీర్ బాల్ దివ్‌సగా కేంద్రం గుర్తించి, దేశంలోని ప్రతి పాఠశాలలో దీన్ని నిర్వహించాలని ఆదేశాలిచ్చిందని తెలిపారు. వీర్ బాల్ దివ్‌సను పాఠ్యాంశంగా చేర్చాలనే అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లి అమలుకు కృషి చేస్తామని చెప్పారు. సికింద్రాబాద్ నుంచి గోల్డెన్ టెంపుల్ వరకు ప్రత్యేక రైలు ఏర్పాటు అంశాన్ని కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకెళతానని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు.