Home » BJP
అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మళ్లీ అధికారం కోసం రైతుల ఆత్మ స్థైర్యం దెబ్బ తీసే ప్రయత్నం చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తోందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
మూసీ బాధితుల ఇంట్లోనే రేపు ఉంటాం, అక్కడే పడుకుంటామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మూసీ బాధితుల సమస్యలను పరిష్కరించేలా రేవంత్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ‘ఆపరేషన్ కమల’ కుట్ర సాగుతోందని ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50కోట్ల చొప్పున చెల్లించాలని రాష్ట్ర బీజేపీ నేతలు ప్రయత్నించారని సీఎం సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. గురువారం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు విజయేంద్ర బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలను మార్కెట్లో లభించే వస్తువులుగా పోల్చి సీఎం అవమానించారన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి ఇంకా రాకపోవడం వల్ల బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడటం ఆయన స్థాయికి సరికాదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.
ఇటీవల వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై జరిగిన దాడి సంఘటనలో మాజీ మంత్రి కేటీఆర్ హస్తం ఉందని, విచారణ పకడ్బందీగా జరపాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు.
లీడర్లు మతం పేరుతో అమాయక ప్రజలను రెచ్చగొడుతున్నారని.. వాళ్ల పిల్లలను మాత్రం విదేశాల్లో చదివిస్తున్నారని కాంగ్రెస్ లీడర్ మండిపడ్డారు.
అవినీతి ఎక్కడ జరిగినా విచారణ జరపాలన్నది తమ డిమాండ్ అని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం మీద సీబీఐ విచారణకు డిమాండ్ చేశామని, సీఎం రేవంత్ రెడ్డి విచారణ కోరారా.. అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు.
ఉపఎన్నికల పోలింగ్ క్రమంలో పశ్చిమబెంగాల్లో పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. నార్త్ 24 పరగణాల జిల్లా జగత్దాల్ ఏరియాలో గుర్తుతెలియని వ్యక్తులు టీఎంసీ నేతను కాల్చిచంపారు. అతనిని జగత్దాల్ 12వ నెంబర్ వార్డు టీఎంసీ మాజీ అధ్యక్షుడుగా పోలీసులు గుర్తించారు.
Bulldozer Justice: రూల్స్‌కు విరుద్ధంగా ఒక్క ఇల్లును కూల్చివేసినా అది రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొన్న సుప్రీం కోర్టు.. బుల్డోజర్ న్యాయం మీద బుధవారం తీర్పు వెలువరించింది. ఇలాంటి సందర్భాల్లో వ్యవహరించాల్సిన విషయమై దేశం మొత్తానికి వర్తించే విధంగా సంచలన తీర్పు ఇచ్చింది.
ఫార్మా కారిడార్ ఏర్పాటు విషయంలో పంతానికి పోవద్దని ముఖ్యమంత్రికి తాను గతంలోనే చెప్పానని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు.