Home » BJPvsCongress
కాంగ్రెస్ పార్టీపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరోసారి ధ్వజమెత్తారు. భారత తొలి ప్రధాని నెహ్రూ హయాంలోనే చైనా దురాక్రమణకు దేశ భూభాగాన్ని కోల్పోయామన్నారు
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ప్రకటనలో తలమునకలయ్యాయి. ఏయే స్థానాల నుంచి ఏయే అభ్యర్థులను పోటీలోకి దించాలనే విషయంపై తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. అయితే పార్టీ నేతలే కాకుండా పార్టీ పెద్దలు, అగ్ర నాయకులు పోటీ చేసే స్థానాలపై సైతం ఉత్కంఠ నెలకొంటోంది.
కర్ణాటక మంత్రి శివరాజ్ తంగడిగి చేసిన కామెంట్స్ దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మోదీ మోదీ అని నినాదాలు చేసే యువతను చెప్పుతో కొట్టాలని చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నాయి.
మరికొద్ది రోజుల్లో జరగబోయే లోక్ సభ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థుల ప్రకటనలో బిజీగా మారాయి. ఎలాగైనా సరే అధికారం చేపట్టాలని భావిస్తున్న ఇండియా కూటమి ఓ వైపు.. మూడో సారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ మరోవైపు పావులు కదుపుతున్నాయి.
2024 లోక్సభ ఎన్నికల్లో 400 కంటే ఎక్కువ సీట్లు గెలవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( PM Modi ) లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటుచేసిన ఇండియా కూటమిలో పరిస్థితులు ఇంకా సద్దుమణగలేదు. కూటమి ఏర్పాటు చేసినప్పుడు చాలా పార్టీలతో కలకలలాడిన ఇండియా కూటమి ప్రస్తుతం కీలక పార్టీల నిష్క్రమణతో వెలవెలబోయింది.
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్(Karnataka Congress), ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ(BJP) రాజకీయ వేడి ఢిల్లీని తాకింది. కేంద్ర నిధులు రెండు పార్టీల మధ్య చిచ్చు రాజేసింది.
భారత్ జోడో న్యాయ్ యాత్ర విజయవంతం కావడంతోనే అసోం సీఎం భయపడి దాడులకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అసోంలోని సునీత్పూర్ జిల్లా జుముగురిహాట్ వద్ద కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కారుపై పలువురు వ్యక్తులు దాడి చేశారని కాంగ్రెస్ అంటోంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చాక.. రాజస్థాన్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. మొత్తం 199 స్థానాలకు ఎన్నికలు ముగియగా.. హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని ఎగ్జి పోల్స్ అంచనా వేస్తున్నాయి.
రాముడిని(Lord Rama) ఒకప్పుడు కల్పిత పాత్ర అని పిలిచిన కాంగ్రెస్ ఇప్పుడు ఓట్ల కోసం రాముడి భక్తుడిగా మారిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda)ఎద్దేవా చేశారు.