సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తున్నాం: బొత్స
ABN , Publish Date - Dec 14 , 2024 | 06:00 AM
సాగునీటి సంఘాల ఎన్నికలను కూటమి నేతలు అపహాస్యం చేస్తున్నారని, అందుకే ఎన్నికలను తమ పార్టీ బహిష్కరిస్తోందని వైసీపీ సీనియర్ నాయకుడు, శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు.
విశాఖపట్నం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): సాగునీటి సంఘాల ఎన్నికలను కూటమి నేతలు అపహాస్యం చేస్తున్నారని, అందుకే ఎన్నికలను తమ పార్టీ బహిష్కరిస్తోందని వైసీపీ సీనియర్ నాయకుడు, శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ లాసన్స్‌బే కాలనీలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న తమ అభ్యర్థులకు వీఆర్‌ఓలు నోఅబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. నీటిసంఘాల ఎన్నికల్లో పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని బొత్స ప్రశ్నించారు. వీటన్నింటి కారణంగా ఎన్నికలను బహిష్కరిస్తున్నామన్నారు. ‘రైతన్నలకు అండగా’ పేరుతో శుక్రవారం వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని ఆయన తెలిపారు. కాగా, సినీ నటులు అల్లు అర్జున్, మోహన్‌బాబుల విషయాల్లో ప్రభుత్వాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సంయమనం పాటించాలని వ్యాఖ్యానించారు. గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి 20 మంది మృతిచెందారని, ఆ ఘటనకు ఎవరిని బాధ్యులు చేశారనేది పరిశీలించాలని కోరారు.