Home Minister Anitha: మాజీ మంత్రి బొత్సకు ఆ విషయం కూడా తెలియదా.. హోంమంత్రి అనిత విసుర్లు
ABN , Publish Date - Jan 21 , 2025 | 07:29 PM
Home Minister Anitha: పలు మంత్రి పదవుల్లో కొనసాగిన బొత్స సత్యనారాయణకు ముద్దాయికి, సాక్షికి తేడా తెలియకపోవటం బాధాకరమని హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. రామతీర్ధంలోని రాముని విగ్రహ ధ్వంసం కేసులో సాక్షిగా ఉన్న వ్యక్తికి సహకరిస్తే బొత్స వ్యాఖ్యల్లో వారి అవగాహన రాహిత్యం బయటపడిందని విమర్శించారు.

విజయనగరం: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు సంస్కృతి, సంప్రదాయాల విలువలు తెలియవని హోం మంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. జిల్లా కలెక్టరేట్‌లో అధికారులు, శాసనసభ్యులతో ఇవాళ(మంగళవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. వైసీపీ నేతల మాదిరిగా సంక్రాంతికి తాము క్యాసినో ఆడించలేదు. అశ్లీలతకు తావివ్వలేదని చెప్పారు. సంక్రాంతి సంబరాల నిర్వహణపై ఒక్క గొడవ జరగలేదని... ఒక్క ఫిర్యాదు కూడా అందలేదని మంత్రి వంగలపూడి అనిత అన్నారు.
పలు మంత్రి పదవుల్లో కొనసాగిన బొత్సకు ముద్దాయికి, సాక్షికి తేడా తెలియకపోవటం బాధాకరమని చెప్పారు. రామతీర్థంలోని రాముని విగ్రహా ధ్వంసం కేసులో సాక్షిగా ఉన్న వ్యక్తికి సహకరిస్తే బొత్స వ్యాఖ్యల్లో వారి అవగాహన రాహిత్యం బయటపడిందని విమర్శించారు. కోటి సభ్యత్వాల స్ఫూర్తితో టీడీపీని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. టీడీపీకి బలం, బలగం కార్యకర్తలేనని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
చంద్రబాబు రాష్ట్ర పురోగతి కోసం పాటుపడుతున్నారు: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు
పల్నాడు జిల్లా: కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని తెలుగుదేశం చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మైనస్ డిగ్రీల చలిలో సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనే ఇందుకు నిదర్శనమని అన్నారు. గత పాలకులు పెట్టుబడుల ఆకర్షణకు స్వస్తి చెప్పి, చలి వేస్తోందని ఇళ్లలో పడుకున్నారని విమర్శించారు. చంద్రబాబు వయస్సుని, వాతావరణాన్ని లెక్కచేయక రాష్ట్ర పురోగతి కోసం ఎంతో పాటుపడుతున్నారని చెప్పారు. అధికారులు బాధ్యతా యుతంగా పనిచేస్తేనే ఎక్కడైనా అభివృద్ధి సాధ్యమన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను నిలబెట్టినట్టే అమరావతి నిర్మాణం చేస్తారని తెలిపారు. చంద్రబాబు ఏపీని ప్రపంచం గర్వించే స్థాయిలో నిలుపుతారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత
Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..
CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే
Read Latest AP News And Telugu News