Botsa on lokesh: అలాంటి రాజకీయాలు విద్యా వ్యవస్థకు పెద్ద కళంకం
ABN , Publish Date - Mar 04 , 2025 | 03:34 PM
Botsa: వీసీల రాజనామా అంశంపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మరోసారి నిప్పులు చెరిగారు. వీసీలు తప్పులు చేస్తే చర్యలు తీసుకోవాలన్నారు. బెదిరింపులాతో రాజీనామాలు చేయించడం విద్యా వ్యవస్థకు కళంకమని చెప్పుకొచ్చారు.

అమరావతి, మార్చి 4: వీసీలను బెదరించిన వ్యవహారంపై ఏపీ శాసనమండలిలో రగడ చోటు చేసుకోవడంతో సభ వాయిదా పడింది. అనంతరం శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ (YSRCP MLC Botsa Satyanarayana) అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. వీసీల రాజనామాలపై దర్యాప్తు జరపమని రెండు రోజుల క్రితం కోరామని.. ఆధారాలు ఇవ్వాలని ప్రభుత్వం కోరిందన్నారు. అన్ని ఆధారాలు నేడు మండలి ముందుకి తీసుకొని వచ్చినట్లు తెలిపారు. గవర్నర్ నియమించిన వీసీలను ఉన్నత విద్యాశాఖ అధికారులు ఏ విధంగా రాజీనామాలు చేయమని చెపుతారని విచారణ చేయమని చెప్పామన్నారు. అయితే ప్రభుత్వం తోక ముడుచుకొని వెళ్ళిందని విమర్శించారు.
విచారణ చేయకుండా సవాల్ విసిరారని.. ఈ రోజు ఏమైందని ప్రశ్నించారు. సమాధానం చెప్పలేక దాబాయింపు, బుకాయింపులు, పరుష పదజాలంతో దూషణలు చేశారన్నారు. విచారణ జరగాలని.. వాస్తవాలు బయటకు రావాలని డిమాండ్ చేశారు. వీసీలు తప్పులు చేస్తే చర్యలు తీసుకోవాలన్నారు. బెదిరింపులాతో రాజీనామాలు చేయించడం విద్యా వ్యవస్థకు కళంకమని ఎమ్మెల్సీ అన్నారు. వీసీలుగా క్వాలిఫైడ్ వాళ్ళను మాత్రమే నియమిస్తారని... దానికి ఒక కమిటి ఉందని తెలిపారు. వీసీలుగా క్వాలిఫైడ్ కానీ వాళ్ళని నియమిస్తే విచారణ జరపాలన్నారు. ఉన్నత విద్యా శాఖ ఆదేశాలతో రాజీనామా చేయాలని ఆదేశించారని.. అన్న దానిపై విచారణ జరపాలని అడుగుతున్నామన్నారు.
ఎత్తు తగ్గితే ఊరుకోం...
పోలవరంపై ఎత్తు తగిస్తున్నారా లేదా చెప్పకుండా పూర్వపరాలు చెపుతూ గొప్పలు చెప్పుకొంటున్నారన్నారు. పోలవరం ఎత్తు తగ్గించడానికి వీలు లేదని స్పష్టం చేశారరు. 45.72 ఎత్తు తగ్గిస్తే పవర్ ప్లాంట్ రాదని.. ఉత్తరాంధ్ర, రాయలసీమకి నీళ్లు రావని తెలిపారు. పోలవరంపై ఎత్తు తగ్గింపు అంశాల్లో కూడా ప్రభుత్వం స్వస్థత ఇవ్వలేదన్నారు. చేనేత అంశంపై మాట్లాడితే.. బలహీన వర్గాల కోసం మాట్లాడితే శవాలపై పేలాలు ఎరుకోవడం అంటూ కించపరుస్తూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హామీలు ఇచ్చి మోసం చేసింది చంద్రబాబు అంటూ వ్యాఖ్యలు చేశారు. రూ.960 కోట్లతో నేతన్నను వైస్సార్సీపీ ఆదుకుందని తెలిపారు. ప్రభుత్వం సత్యదూరం అయిన మాటలు మాట్లాడుతోందన్నారు. 9 నెలల కాలంలో నేతన్నలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.
పులి, సింహం పిల్లలను ఆడించిన ప్రధాని మోదీ
కేంద్రమే నిర్మించాలి.. కానీ
సవాల్ చేసినప్పుడు దమ్ము ధైర్యం ఉంటే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే, మాట మీద నిలబడితే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలవరం అంచల వారీగా నిధులు ఇవ్వామని ఆడిగామని.. అందులో 41.15 ఉందన్నారు. పోలవరం 45.72 ఎత్తు వరకు ఉంటుందని చెప్పామన్నారు. పోలవరం ప్రజల జీవనాడీ అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు కాంట్రాక్టర్లకు లబ్ధికోసం పోలవరం పనిచేసిందని విమర్శించారు. రికార్డులు పరిశీలిస్తే వాస్తవాలు బయట పడతాయన్నారు. పోలవరం మన హక్కు అని.. కేంద్రం నిర్మించి ఇవ్వాలని కానీ కాంట్రాక్టర్ల కోసం చంద్రబాబు స్టేట్ బాధ్యత తీసుకుందని ఆరోపించారు.
వారికి వ్యతిరేకం కాదు..
విద్యుత్ డిస్కామ్‌లు సంక్షోభంలో ఉన్న వాటిని కాపాడటానికి రూ.47వేల కోట్లు పెట్టామని తెలిపారు. ఇప్పుడు ప్రజలపై వేసిన 15వేల కోట్లు ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేశారు. 14 - 19 చేసిన అప్పులో 1/3 కూడా తాము అప్పులు చేయలేదని చెప్పుకొచ్చారు. ‘‘నేను మాట్లాడే ప్రతిమాట.. రికార్డులల్లో ఉన్నదే.. బడ్జెట్‌లో పెట్టిందే.. మేము ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయలేదు. కూటమి ప్రభుత్వం నిలబెట్టిన అభ్యర్థులకు మేము వ్యతిరేకం అని మాత్రమే చెప్పం. రిగ్గింగ్‌లు, డబ్బుల పంపిణీ, అధికార దుర్వినియోగం చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి గెలుపొందింది. రఘువర్మ మా అభ్యర్థి అని కూటమి నేతలు ప్రచారం చేశారు. ఇప్పుడు గెలిచిన వ్యక్తి తమ అభ్యర్థి అంటున్నారు.. మాకు పుట్టిన పిల్లోడని మా కొడుకు అనాలి..కానీ ఎవరికో పుట్టిన పిల్లాడు తమ పిల్లాడు అనడం సరైంది కాదు’’ అంటూ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి...
Gold Rates Today: పసిడి కొనుగోలు చేయాలా.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే..
Ukraine Military aid Paused: ఉక్రెయిన్ అధ్యక్షుడికి భారీ షాకిచ్చిన ట్రంప్.. మిలిటరీ సాయం నిలిపివేత
Read Latest AP News And Telugu News