Home » Botsa Satyanarayana
Andhrapradesh: మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డిని సెక్రటేరియట్ ముందు ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు అడ్డుకున్నారు. తమ సీపీఎస్ బకాయిలు చెల్లించాలని రాష్ట్ర సచివాలయం ఉద్యోగులు డిమాండ్ చేశారు. అయితే సమావేశానికి వెళ్తున్న తమను అడ్డగించిన ఉద్యోగులపై మంత్రి బొత్స అసహనం వ్యక్తం చేశారు.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అభ్యర్థులను ఖరారు చేసే పనిలో అధికార వైసీపీ.. టీడీపీ-జనసేన మిత్రపక్షాలు నిమగ్నమయ్యాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల్లో పలువురు సిట్టింగులు, కీలక నేతలకు టికెట్లు దక్కట్లేదు. టికెట్ దక్కిన వారికి సిట్టింగ్ సీటు దొరకట్లేదు. ఇక అసలు విషయానికొస్తే.. తాజా, మాజీ విద్యాశాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ- గంటా శ్రీనివాసరావుల మధ్య చీపురుపల్లిలో ఫైట్ జరగబోతోందని రెండ్రోజులుగా వార్తలు పెద్దఎత్తున సంగతి తెలిసిందే..
విజయనగరం వైసీపీలో భారీ కుదుపు చోటు చేసుకుంది. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామిపై వైసీపీ నేతలు తీవ్ర అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. వైసీపీ కీలక నేతలు పిల్లా విజయ్ కుమార్ , అవనాపు విజయ్ , గాడు అప్పారావు కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహించారు.
విజయనగరం: వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది. డిప్యూటీ స్పీకర్ కోలగట్లపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. వైసీపీ కీలక నేతలు పిల్లా విజయ్ కుమార్, అవనాపు విజయ్, గాడు అప్పారావు తమ కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహించారు.
ఉద్యోగ సంఘాలతో పెండింగ్లో ఉన్న అంశాలపై చర్చలు జరిపామని.. పీఆర్సీని వీలైనంత త్వరగా ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికే పీఆర్సీ కమిషన్ వేశామన్నారు. ఉద్యోగ సంఘాలు మధ్యంతర భృతి కోరాయని.. దానిపై పరిశీలన చేస్తున్నామని పేర్కొన్నారు.
అమరావతి: cs.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు దాఖలు చేయొచ్చునని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధ్యాయ నోటిఫికేషన్ ద్వారా నియామకాలు పూర్తి అయితే జీరో వేకెన్సి అవుతుందన్నారు.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు ఢిల్లీ పర్యటన పొత్తులు కోసమా?.... అది జరిగితే అప్పుడు స్పందిస్తా’’ అంటూ కామెంట్స్ చేశారు.
Andhrapradesh: నిరుద్యోగుల ఎదురుచూపులు ఫలిస్తూ ఏపీలో డీఎస్సీ -2024 నోటిఫికేషన్ విడుదలైంది. 6100 టీచర్ పోస్టుల భర్తీకి బుధవారం మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు.
Andhrapradesh: అధికారంలోకి వచ్చాక ప్రతీ సంవత్సరం మెగా డీఎస్సీ అంటూ మాటలు చెప్పిన జగన్.. ఆ మాటే మరిచినట్టున్నారు. ప్రతీ ఏడాది కచ్చితంగా డీఎస్సీ ఉంటుందంటూ అభ్యర్థులు ఎదురుచూస్తూ ఉండగానే నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ప్రధాన పార్టీలన్నీ తమతమ వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈసారి గెలుపు అవకాశాలున్న అభ్యర్థులకే ఛాన్స్ ఇస్తామని చెప్పినట్టుగానే.. అభ్యర్థులను మార్చేస్తున్నారు.