AP Politics: టీచర్ల బదిలీపై బొత్స రియాక్షన్.. అసలు కారణమిదేనట..!
ABN , Publish Date - Jun 07 , 2024 | 05:55 PM
టీచర్ల బదిలీలపై మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ(Botsa Satyanarayana) స్పందించారు. రాష్ట్రంలో టీచర్ల అక్రమ బదిలీలు(Teachers Transfers News) జరిగాయని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి వీలుగా బదిలీలు నిలిపివేయాలని అధికారులకు తానే విజ్ఞప్తి చేశానని బొత్సా సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ(Education Department of Andhra Pradesh) పరిధిలో గతంలో..
విశాఖపట్నం, జూన్ 07: టీచర్ల బదిలీలపై మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ(Botsa Satyanarayana) స్పందించారు. రాష్ట్రంలో టీచర్ల అక్రమ బదిలీలు(Teachers Transfers News) జరిగాయని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి వీలుగా బదిలీలు నిలిపివేయాలని అధికారులకు తానే విజ్ఞప్తి చేశానని బొత్సా సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ(Education Department of Andhra Pradesh) పరిధిలో గతంలో జరిగిన ఉపాధ్యాయుల బదిలీలు నిలిపివేశారన్నారు. ఈ బదిలీలపై అవాస్తవాలను ప్రసారం చేస్తున్నారని అన్నారు. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ.. ప్రచురితమైన వార్తాంశాలు పూర్తిగా అవాస్తవం అని కొట్టిపారేశారు.
అభూత కల్పనలతో నా వ్యక్తిత్వ హననానికి చేస్తున్న ప్రయత్నం తప్ప మరొకటి కాదని అన్నారు బొత్సా. అన్నికలకు ముందు నుంచి కూడా ఇవే ఆరోపణలతో అనేకసార్లు వార్తలు ప్రచురించారని, అప్పుడే ఈ ఆరోపణలు ఖండించానన్నారు. ఇప్పుడు మరోసారి ఖండిస్తున్నానని అన్నారు. కొంతమంది ఉపాధ్యాయులు తమ ఆరోగ్య, కుటుంబ ఇతరత్రా ఇబ్బందులు, వివిధ వ్యక్తిగత సమస్యల రీత్యా బదిలీలు కోరుకుంటూ అర్జీలు పెట్టుకున్నారన్నారు. వాటిని పూర్తి పారదర్శకంగా పరిశీలించి క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకున్న తరువాతే అప్పట్లో బదిలీలపై నిర్ణయం తీసుకున్నామన్నారు.
అయితే, ఫలితాలు వెలువడిన వెంటనే.. ఈ బదిలీలు నిలిపివేయాల్సిందిగా సంబంధిత అధికారులను తానే స్వయంగా కోరానన్నారు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం వస్తున్న నేపథ్యంలో వారు తమకు నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చునని అన్నారు. బదిలీల కోసం అర్జీ చేసుకున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిగణనలోకి తీసుకుంటారా? లేదా? అన్నది కొత్త ప్రభుత్వం ఇష్టం అని బొత్సా వ్యాఖ్యానించారు. వాస్తవాలు ఇలాల ఉంటే.. బదిలీల కోసం లంచాలు తీసుకున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. వీటిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానిన బొత్సా సత్యనారాయణ తెలిపారు. ఇలాంటి తప్పుడు పనులు చేయాల్సిన అగత్యం, అవసరం తమకు లేవని బొత్స అన్నారు.