Home » Buddha Venkanna
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సంబంధించి ప్రజల తీర్పు ఎలా ఉందో చూశారని.. ఈ ఎన్నికల్లో ఆరా మస్తాన్ సర్వే ఏమైందో చూశారని.. ఆరా మస్తాన్‌ది కేవలం బెట్టింగ్‌ల కోసం జగన్ అండ్ కో చేసిన ఫేక్ సర్వే అని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాల ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ- టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్‌కు దారితీసింది. ఏపీలో వైసీపీ మరోసారి అధికారం చేపడుతుందని ఆరా మస్తాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మస్తాన్ వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఖండించారు.
టీడీపీ ముఖ్య నేత బుద్దా వెంకన్న కీలక కామెంట్స్ చేశారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతలను లోకేష్‌కు అప్పగించాలన్నారు. ఇటీవల జరిగిన పోలింగ్‌లో కూటమికే ప్రజలు పట్టం కట్టారని.. 130 స్థానాల్లో విజయం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన బుద్దా వెంకన్న.. కీలక వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: కేశినేని నానిని చూసి ఊసర వెల్లి కూడా సిగ్గు పడుతోందని, రాజకీయాల్లో ఎక్కవ రంగులు మార్చిన చరిత్ర కేశినేని నానిదేనని, ప్రజారాజ్యం, టీడీపీలను మోసం చేసిన ఆయన వైసీపీలో చేరి భజనలు చేస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నేత బుద్ధ వెంకన్న తీవ్ర స్థాయిలో విమర్శించారు.
బెజవాడలో టీడీపీ పార్లమెంటు అభ్యర్థి కేశినేని చిన్ని (శివనాథ్) నామినేషన్ ర్యాలీ హీట్ పుట్టించింది, ఎండను సైతం లెక్కచేయకుండా వేలాదిగా చిన్ని ర్యాలీకి ప్రజానీకం మద్దతు తెలిపింది. ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా వివిధ వర్గాలకు చెందిన మహిళలు నిలిచారు. చిన్నికి అడుగడుగునా జన నీరాజనాలు పలికారు. ఎక్కడికక్కడ హారతులు ఇచ్చి మహిళలు స్వాగతం పలుకుతున్నారు.
మంత్రి జోగి రమేష్ ఓ జోకర్ అని, పిచ్చి పిచ్చి వేషాలేస్తే బట్టలూడదీసి తంతామని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న హెచ్చరించారు. చంద్రబాబు ఇంటికి వెళ్తానని, ధర్నా చేస్తానని జోగి రమేష్ ప్రగల్భాలు పలుకుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నేతలు అధికార నేతలపై విమర్శల అస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ లీడర్ బుద్దా వెంకన్న సీఎం జగన్ ( CM Jagan ) పై ఫైర్ అయ్యారు. ఈ ఎన్నికల తర్వాత వైసీపీకి తెలంగాణలో బీఆర్ఎస్ కు పట్టిన గతే పడుతుందని మండిపడ్డారు.
Andhrapradesh: ఎన్నికల కోడ్ వచ్చినా పోలీస్ వ్యవస్థ భయం లేకుండా ఇంకా ఎందుకు అధికార పార్టీకి కొమ్ముకాస్తోందని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. డీజీపీని విధుల నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తున్నామన్నారు. ఒంటిమిట్ట సుబ్బారావు కుటుంబానికి జరిగిన అన్యాయం వెనుక పాత్రదారులపై 24 గంటల్లో పోలీసు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల కోడ్ వచ్చినా పోలీస్ వ్యవస్థ భయం లేకుండా ఇంకా ఎందుకు అధికార పార్టీకి కొమ్ముకాస్తోందని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ప్రశ్నించారు. డీజీపీని విధుల నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తున్నామన్నారు.
ఎంపీ కేశినేని నానిపై బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. కేశినేని నాని వాపును చూసి బలుపు అనుకుంటున్నారని పేర్కొన్నారు. కనీసం మీ వెనుక పది మంది కూడా రాలేదంటే పరిస్థితి ఏంటో తెలుసుకోవాలన్నారు. కార్యకర్తలు పార్టీ కోసం, టీడీపీ అధినేత చంద్రబాబు కోసం పని చేస్తారన్నారు. క్యాష్ కోసం కేశినేని నాని క్యారెక్టర్ అమ్ముకున్నాడంటూ దుయ్యబట్టారు.