Buddha Venkanna: మాపై అకారణంగా పిన్నెల్లి బ్రదర్స్ దాడి
ABN , Publish Date - Aug 27 , 2024 | 04:44 PM
Andhrapradesh: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పిన్నెల్లి బద్రర్స్ అకారణంగా తమపై దాడి చేశారని అన్నారు. మంగళవారం పల్నాడు జిల్లా అడిషినల్ ఎస్పీ లక్ష్మీపతిని బుద్దా వెంకన్న కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... 2020 మార్చి 11న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెబితేనే తాను, బోండా ఉమా మాచర్లకి వెళ్ళామని తెలిపారు.
పల్నాడు జిల్లా, ఆగస్టు 27: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై (Former MLA Pinnelli Ramakrishnareddy) టీడీపీ నేత బుద్దా వెంకన్న (TDP Leader Buddha Venkanna) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పిన్నెల్లి బద్రర్స్ అకారణంగా తమపై దాడి చేశారని అన్నారు. మంగళవారం పల్నాడు జిల్లా అడిషినల్ ఎస్పీ లక్ష్మీపతిని బుద్దా వెంకన్న కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... 2020 మార్చి 11న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (CM Chandrababu naidu) చెబితేనే తాను, బోండా ఉమా మాచర్లకి వెళ్ళామని తెలిపారు. తమపై పిన్నెల్లి బ్రదర్స్ అకారణంగా దాడి చేశారన్నారు.
AP Politics: వైసీపీ అధిష్టానంపై బాలినేని సంచలన కామెంట్స్..
ఈ దాడిలో పాత్రధారి తురకా కిషోర్, సూత్రధారి పిన్నెల్లి అని చెప్పుకొచ్చారు. ‘‘మా కారుపై పెద్ద పెద్ద రాళ్లతో కొట్టి దాడి చేశారు. మాపై దాడి చేసిన వారికి మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి ఆఫర్ చేశారు. ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడానికి మాపై దాడి ఒక సంకేతం’’ అని చెప్పుకొచ్చారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మాచర్లని పిన్నెల్లి తయారు చేశారని మండిపడ్డారు. తమపై దాడి చేసినప్పుడు ఏ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అప్పటి సంఘటలను గుర్తుచేశారు. అధికారం ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి... లేకపోతే పిల్లి రామకృష్ణారెడ్డి అంటూ వ్యాఖ్యలు చేశారు. ‘‘మమ్మల్ని చంపడానికి పిన్నెల్లి పధకం వేశారు. మాపై దాడి కేసులో పిన్నెల్లి మొదటి ముద్దాయి’’ అని అన్నారు.
MLC Kavitha: హమ్మయ్యా.. కవితకు బెయిల్
పిన్నెల్లికి సవాల్ విసురుతున్నా... ‘‘నీకు మూతి మీద మీసం ఉంటే సరే చూకుందాం. అన్ని ఆలోచించే ఈ కేసు పెట్టాను. ఈ కేసులో నీకు శిక్ష పడే వరకూ నేను పోరాడుతాను. అధికారం ఉంది కాబట్టి అప్పుడు పిన్నెల్లి తప్పించుకున్నాడు. మాపై దాడి చేసి ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా వారే బయటకు వదిలారు. ఎస్పీకి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పవర్ ఉంటే ఒకలా పవర్ లేకపోతే ఒకలా ఉంటారు. పిన్నెల్లి అనే వాడు ఒక పిల్లి లాంటోడు. ఒక మంచి పని కోసం మమ్మల్ని చంద్రబాబు మాచర్లకు పంపారు. పిన్నెల్లి బ్రదర్స్ ప్రజాస్వామ్యంలో తిరగడానికి అనర్హుడు. పిన్నెల్లి దుర్మాగాలను ఇప్పటికైనా పూర్తిగా అణచివేయాలి’’ అని బుద్దావెంకన్న పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Lokesh: తణుకు అన్న క్యాంటీన్‌పై వైసీపీ సైకో బ్యాచ్ విషప్రచారం
Byreddy: చివరకు దేవుని భూములు వదలలేదు.. బైరెడ్డి ఆగ్రహం
Read Latest AP News And Telugu News