Share News

Buddha Venkanna: ధర్మారెడ్డి ఎక్కడున్నా బయటకు రావాలి

ABN , Publish Date - Sep 24 , 2024 | 11:42 AM

Andhrapradesh: ‘‘ధర్మారెడ్డి ఏమయ్యాడు... మాట్లాడడా’’ అని ప్రశ్నించారు బుద్దా వెంకన్న. ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నా బయటకి రావాలన్నారు. వివేకా తరహాలో ఆయన్ని కూడా చంపేశారనే అనుమానం తమకుందంటూ సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. ధర్మారెడ్డి ప్రజల్లోకి వచ్చి.. అప్పుడు జరిగిన విషయాలు చెప్పాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.

Buddha Venkanna: ధర్మారెడ్డి ఎక్కడున్నా బయటకు రావాలి
TDP Leader Buddha Venkanna

విజయవాడ, సెప్టెంబర్ 24: టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిపై (TTD Former EO Dharma Reddy) టీడీపీ నేత బుద్దా వెంకన్న (TDP Leader Buddha Venkanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డుకు సంబంధించి ఇంతటి దుమారం చెలరేగుతున్న సమయంలో ‘‘ధర్మారెడ్డి ఏమయ్యాడు... మాట్లాడడా’’ అని ప్రశ్నించారు. ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నా బయటకి రావాలన్నారు. మాజీ మంత్రి వివేకా తరహాలో ఆయన్ని కూడా చంపేశారనే అనుమానం తమకుందంటూ సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. ధర్మారెడ్డి ప్రజల్లోకి వచ్చి.. అప్పుడు జరిగిన విషయాలు చెప్పాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.

హజ్‌ యాత్రకు లక్ష


అసలు నువ్వు తినేది అన్నమేనా.. పొన్నవోలుపై ఫైర్

తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా బుద్దా వెంకన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి నోటికొచ్చిన విధంగా వాగుతున్నారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో కూడా రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి కూడా ఇలాగే కూతలు కూశారన్నారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుని జగన్‌కు పాలేరులా పని చేశారంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు అరెస్టు సమయంలో ఊరూరా తిరిగి ప్రచారం చేశారన్నారు.


‘‘ఇప్పుడు తిరుమల లడ్డూను అపవిత్రం చేసినా పంది కొవ్వుతో పోల్చి మాట్లాడుతున్నారు.. అసలు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా.. పంది కొవ్వు గురించి జగన్, విజయసాయి రెడ్డిలకు చెప్పు. గతంలో వారి ద్వారా ప్రజాధనం తిన్నావు. అన్నంలో నువ్వు పంది కొవ్వు వేసుకుంటున్నావా, నెయ్యి వేసుకుంటున్నావా. లాయర్ అయితే ఏదైనా వాగుతావా... నీకు లా పట్టా ఎవరిచ్చారు. నిబంధనలు పాటించని నువ్వు లాయర్‌గా అనర్హుడివి. నీ‌ లా పట్టా రద్దు చేయాలని కోరుతున్నా. హైకోర్టు సుమోటాగా తీసుకుని పొన్నవోలుపై కేసుపెట్టాలి. న్యాయ వ్యవస్థకే కళంకితం తెచ్చే పొన్నవోలుకి కోర్టులో అనుమతించకూడదు. నువ్వు ఇంకో ఒక్కసారి వాగితే .. నీకు తగిన బుద్ధి చెబుతాం. దమ్ముంటే నాపై కేసు పెట్టుకో.. న్యాయదేవత సాక్షిగా నీ సంగతి తేలుతుంది’’ అంటూ హెచ్చరించారు.

Pawan Kalyan: హీరో కార్తీకి పవన్ కల్యాణ్ వార్నింగ్


దేవుడు తప్పక బుద్ధి చెబుతాడు..

‘‘భూమన కరుణాకర్‌ రెడ్డి నిన్న తిరుమలపై డ్రామా ఆడారు.. వెంకటేశ్వర స్వామి ఆస్తులను కొల్లగొట్టిన నువ్వా ప్రమాణం గురించి మాట్లాడేది. రక్తం కక్కుకుని చస్తా అని అంటున్నావు..‌దేవుడు వెంటనే శిక్షించడు. కానీ నీకు ఆ దేవుడు తప్పకుండా బుద్ధి చెబుతాడు. నేను హిందువు అంటున్నావు.. క్రైస్తవ పద్దతిలో మీ ఇంట్లో పెళ్లి చేయలేదా. నీకు నచ్చిన మతం తీసుకో..‌ కానీ వెంకన్నకు అపచారం చేస్తే ఊరుకుంటామా. లడ్డు వ్యవహారంలో నోటి కొచ్చినట్లు వాగితే ప్రజలు చెప్పులతో కొడతారు. పొన్నవోలు... బుద్ధి ఉన్నవాడు ఎవడైనా నీలాగా మాట్లాడతాడా. నీకు పాపం పండింది... శిక్ష అనుభవించడానికి సిద్దం గా ఉండు’’ అని టీడీపీ నేత వ్యాఖ్యలు చేశారు.


క్షమాపణ చెప్పాల్సిందే..

రాష్ట్రంలో ఉన్న ఆలయాలను అపవిత్రం చేయడానికి జగన్ ప్రయత్నం చేశారని ఆరోపించారు. అసలు పందికొవ్వు , నెయ్యి... బంగారం, ఇత్తడితో పోలికేంటి అంటూ మండిపడ్డారు. మదమెక్కి తిక్క ఎక్కి, జగన్ కోసం వాగుతున్నారన్నారు. మోకాళ్ల మీద నిలబడి పొన్నవోలు క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉండి చంద్రబాబుపై విమర్శలు చేశారన్నారు. బార్ అసోసియేషన్‌లు కూడా ఆలోచనలు చేయాలని.. పొన్నవోలును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు కూడా స్పందించి పొన్నవోలును ప్రాసిక్యూట్ చేయాలన్నారు.

Tirumala Laddu Controversy: పొన్నవోలు, ప్రకాష్ రాజ్‌ వ్యాఖ్యలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన పవన్


ఆ ముగ్గురిని అరెస్ట్ చేయాలి..

దేశంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయిన చరిత్ర ఏపీలోనే జరిగిందన్నారు. పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును అరెస్టు చేసి విచారణ చేయాలన్నారు. ఇంటిలిజెన్స్ అధికారిగా కాకుండా మాఫియా డాన్‌గా పని చేశారని విమర్శించారు. ప్రభుత్వ అధికారిగా ఉండి.. జగన్‌కు అనుచరుడిగా వ్యవహరించారన్నారు. ఒక అమ్మాయికి అన్యాయం చేసిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను అరెస్టు చేయాలన్నారు. చాలా మంది అధికారులు జగన్‌కు తొత్తులుగా పని చేశారని బుద్దా వెంకన్న వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి..

Hyderabad: ట్రాఫిక్‌ పోలీసుల ‘చిల్లర’ దందా!

Tirupati Laddu: తిరుమల లడ్డూ వ్యవహారం.. సిట్ అధిపతి ఎవరంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 24 , 2024 | 11:52 AM