Share News

Budda Venkanna: వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు నటి జిత్వానీ ఉదంతం ఒక నిదర్శనం

ABN , Publish Date - Aug 30 , 2024 | 10:52 AM

Andhrapradesh: వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు జిత్వానీ ఉదంతం ఒక నిదర్శనమని టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... విజయసాయి రెడ్డి, శాంతి వ్యవహారం చూశామని... గంట, అరగంట మంత్రులు ఏమన్నారో చూశామన్నారు. ఇప్పుడు సకలశాఖ మంత్రి చేసిన దారుణం చూస్తున్నామని అన్నారు.

Budda Venkanna:  వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు నటి జిత్వానీ ఉదంతం ఒక నిదర్శనం
TDP Leader Budda Venkanna

విజయవాడ, ఆగస్టు 30: వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు జిత్వానీ ఉదంతం ఒక నిదర్శనమని టీడీపీ నేత బుద్దా వెంకన్న (TDP Leader Budda Venkanna) వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... విజయసాయి రెడ్డి, శాంతి వ్యవహారం చూశామని... గంట, అరగంట మంత్రులు ఏమన్నారో చూశామన్నారు. ఇప్పుడు సకలశాఖ మంత్రి చేసిన దారుణం చూస్తున్నామని అన్నారు. జగన్ పాలనకు, చంద్రబాబు పాలనకు ఎంత తేడా ఉందో చూడాలన్నారు. జగన్, వారి మంత్రులు చేసిన అరాచకాలు, దారుణాలు అన్నీ ఇన్నీ కావని మండిపడ్డారు.

CM Revanth Reddy: నా వ్యాఖ్యలు వక్రీకరించారు... సుప్రీం కోర్టు సీరియస్‌ కావడంపై రేవంత్



ఆడుదాం ఆంధ్రా అని కోట్లు దోచుకున్నార న్నారు. ఆడుదాం ఆడవాళ్లతో అని అమాయక మహిళల జీవితాలు నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు నటి జిత్వానీ కేసులో ఐపీఎస్ అధికారుల పాత్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ‘‘కుక్కల విద్యాసాగర్ కేసు పెడితే .. ఐపీఎస్‌లు పరుగులు పెట్టారంట .ఛీటింగ్ కేసులో పోలీసులు అంత త్వరగా స్పందించడం అభినందనీయం. మరి ఇతర కేసుల్లో ఇలా ఎందుకు దర్యాప్తు చేయలేదు. సజ్జల కనుసన్నల్లో ఈ వ్యవహారం మొత్తం నడిపారు.ఆనాటి డీజీపీ కూడా ఈ ఘటనలకు బాధ్యత వహించాలి.విద్యాసాగర్, సజ్జల, రాజేంద్రనాద్ రెడ్డి, కాంతి రాణా టాటాలను అదుపులోకి తీసుకోవాలి. ఈ కేసుల్లో పాత్రధారులు, సూత్రధారులను ప్రాసిక్యూట్ చేయాలి ’’ అని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదన్నారు. చివరకు ఖాకీలు కూడా కర్కశంగా వ్యవహరించారన్నారు. అమ్మాయి జీవితం నాశనం చేసిన వారందరినీ కఠినంగా శిక్షించాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.

YS Jagan: కీలక సమయంలో విదేశాలకు వైఎస్ జగన్.. వ్యూహమేంటో..?


ఇదీ విషయం...

కాగా.. ముంబై నటి, వైద్యురాలు కాదంబరి జెత్వానీని తప్పుడు కేసులో ఇరికించి, ఆమె కుటుంబ సభ్యులనూ అరెస్టు చేసి, అక్రమంగా నిర్బంధించి, చిత్రహింసలు పెట్టిన కేసులో సీనియర్‌ ఐపీఎ్‌సల పాత్ర తేల్చేందుకు రంగం సిద్ధమైంది. రెండు తెలుగురాష్ట్రాలతో పాటు... ముంబైలో, సినీ వర్గాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసుపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. నటి కాదంబరిపై కుక్కల విద్యాసాగర్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఫిర్యాదు చేయడం... ఆ మరుసటి రోజునే ముంబైలో ఏపీ పోలీసులు ఆమెను అరెస్టు చేయడం జరిగింది. ఆ తర్వాత ఏపీలో తనను వేధించిన తీరుపై ఆగస్టు 1వ తేదీన ముంబై జుహూ పోలీసుస్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. ‘‘నన్ను, నా తల్లిదండ్రులను ఏపీ పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరి 3న అరెస్టు చేశారు. ఫిబ్రవరి 2న ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి, 24 గంటల్లోనే రోడ్డు మార్గాన విజయవాడ నుంచి ముంబై వచ్చి ఎలాంటి ఆధారాలు లేకున్నా అరెస్టు చేశారు’’అని నటి తెలిపారు.


ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో గురువారం విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ రాజశేఖరబాబుకు నటి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు... ఆమె నేరుగా విజయవాడకు వచ్చేస్తున్నారు. గురువారం రాత్రి ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కాదంబరి... శుక్రవారం విజయవాడ చేరుకోనున్నారు. ఇక్కడ ఆమె పోలీసులు ఆమె వాంగ్మూలం నమోదు చేస్తారు. అదే సమయంలో తనను వేధించిన ఏపీ ఐపీఎ్‌సలపై ఆమె ఫిర్యాదు చేసే అవకాశముంది. ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు విచారణాధికారిగా విజయవాడ ఏసీపీ కె.స్రవంతి రాయ్‌ని నియమించింది. డీజీపీ ఆదేశాల మేరకు విజయవాడ పోలీసు కమిషనర్‌ రాజశేఖర బాబు గురువారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి..

Cyber Crime: మచిలీపట్నంలో మరో ఆన్‌లైన్ మోసం..

AP Govt: ఒకే కాంట్రాక్టర్‌కు రూ.64 కోట్ల చెల్లింపులు... ఆర్థిక శాఖలో బయటపడుతున్న వాస్తవాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 30 , 2024 | 11:01 AM