Share News

Budda Venkanna: ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులపై బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 18 , 2024 | 10:50 AM

Andhrapradesh: ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులు ముంబై నటి‌ని చిత్ర హింసలు పెట్టారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాల్ గున్నీ స్టేట్‌మెంట్‌ను బట్టి సీఎంఓ కేంద్రంగా కుట్ర జరిగిందన్నారు. మాజీ సీఎం జగన్ ఆదేశాలను పీఎస్‌ఆర్ ఆంజనేయులు అమలు‌ చేశారని మండిపడ్డారు. అతని ద్వారా రాణా, విశాల్ గున్నీ దుర్మార్గంగా వ్యవహరించారని దుయ్యబట్టారు.

Budda Venkanna: ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులపై బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు
TDP Leader Budda Venkanna

విజయవాడ, సెప్టెంబర్ 18: ముంబై నటి జెత్వాని Mumbai actress Jethwani) కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల (IPS Officers) తీరుపై టీడీపీ నేత బుద్దా వెంకన్న (TDP Leader Budha Venkanna) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ముగ్గురు ఐపీఎస్ అధికారులు ముంబై నటి‌ని చిత్ర హింసలు పెట్టారన్నారు. విశాల్ గున్నీ స్టేట్‌మెంట్‌ను బట్టి సీఎంఓ కేంద్రంగా కుట్ర జరిగిందన్నారు. మాజీ సీఎం జగన్ ఆదేశాలను పీఎస్‌ఆర్ ఆంజనేయులు అమలు‌ చేశారని మండిపడ్డారు. అతని ద్వారా రాణా, విశాల్ గున్నీ దుర్మార్గంగా వ్యవహరించారని దుయ్యబట్టారు.

CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. వరద బాధితులకు ప్యాకేజీ.. వివరాలు ఇవే..


గతంలో‌ కూడా ఆంజనేయులు అనేక మందిని ఇబ్బందులకు గురిచేశారన్నారు. డీసీపీ రమణమూర్తి పాత్ర కూడా ఉన్నట్లు తేలిందన్నారు. గున్నీ రిపోర్ట్ ఆధారంగా ఆంజనేయులును అరెస్టు చేసి పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలని కోరారు. అతన్ని విచారిస్తే అనేక వాస్తవాలు బయటకి వస్తాయన్నారు. సీఎంఓలో జగన్ పాత్ర కూడా వెలుగులోకి వస్తుందని తెలిపారు. ఒక‌ ఆడపిల్లను ముగ్గురు ఐపీఎస్‌లు‌ హింసించారని తేలిందని.. తప్పు చేసిన వారు ఎవరైనా కఠినంగా శిక్షించాలన్నారు. పోలీసు అధికారుల సంఘం‌ కూడా స్పందించాలని డిమాండ్ చేశారు. ఆనాడు జగన్ చెప్పినట్లు మాట్లాడిన అధికారులు.. మీ‌ పోలీసులు నిర్వాకంపై మాట్లాడరా అని ప్రశ్నించారు.

Ganesh Immersion: భారీగా నిలిచిపోయిన వినాయక విగ్రహాలు.. ఎంత వరకు బారులు తీరాయో తెలుసా..


గత ప్రభుత్వంలో చంద్రబాబు (CM Chandrababu), నారా లోకేష్‌లను అనేక సార్లు అడ్డుకున్నారని.. కక్ష పూరితంగా చేసిన ఆనాటి అధికారుల పాత్రపై‌ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. వీళ్లను‌ వదిలేస్తే ఇలానే మళ్లీ చేస్తారని.. అలా జరగకూడదన్నారు. కక్ష పూరిత రాజకీయాలు వద్దని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు తమకు చెప్పారన్నారు. ‘‘మీమీద ఉన్న గౌరవంతో మేము సైలెంట్‌గా ఉన్నాం. కానీ ఆ ఘటనలపై‌ విచారణ చేసి చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు. పీఎస్‌ఆర్ ఆంజనేయులును అరెస్టు చేసి విచారణ చేస్తే అందరూ బయటకి వస్తారని.. ప్రభుత్వం ఆ దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న కోరారు.


ఇవి కూడా చదవండి...

Pagers: పేజర్లతో పేలుడు విధ్వంసం.. పేజర్ అంటే ఏంటి, వీటి వాడకం ఎక్కడ

Srinivasrao: చీటెడ్ అకౌంటెంట్ విజయసాయి నోరు అదుపులో పెట్టుకో..

Read LatestAP NewsAndTelugu News

Updated Date - Sep 18 , 2024 | 10:55 AM