Home » Case
విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ మదర్సాలో ఫుడ్ పాయిజన్ జరిగడంతో పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి భోజనం చేసిన పిల్లల్లో 10 మందికి వాంతులయ్యాయి.
పల్నాడు జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదైంది. తెలుగు యువత పల్నాడు జిల్లా కార్యదర్శి కొమర శివపై పిన్నెల్లి మాచర్ల కోర్టు వద్ద పిడికిలితో కడుపులో గుద్ది దాడి చేశారని పేర్కొంటూ శివ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అధికారులకు కోర్టులో చుక్కెదురైంది. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుపై అధికారులు ఇటీవల నాంపల్లి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఆ అభియోగపత్రాలను పరిశీలించిన న్యాయమూర్తి అందులో వివరాలు, సమర్పించిన ఆధారాలు సమగ్రంగా లేవని పేర్కొంటూ..
పగిడ్యాల( Pagidiala) మండలం ఘణపురం(Ghanapuram)లో వ్యక్తిపై దాడి కేసులో నందికొట్కూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2013లో నరేంద్రనాథ్ రెడ్డి అనే వ్యక్తిపై అప్పటి ఎస్సై మారుతీ శంకర్ దాడి చేశారు. దీనిపై బాధితుడు అప్పట్లో ప్రైవేటు కేసు వేశారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన బాలిక వసంత హత్య కేసులో తాజాగా షాకింగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. ఆమె తండ్రే ప్రధాన సూత్రధారి అని పోలీసుల విచారణలో..
పలు పబ్‌లలో డిస్క్ జాకీ (డీజే)గా పనిచేస్తున్న వ్యక్తితో పాటు అతడితో టచ్‌లో ఉన్న ఇద్దరు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీ న్యాబ్) డైరెక్టర్ సందీప్ శాండిల్య సోమవారం ఈ వివరాలను వెల్లడించారు.
పోక్సో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు యడియూరప్పపై బెంగళూరు కోర్టు నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ పోలీసులు ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది. సాయం కోసం కుమార్తె(17)తో కలిసి తాను ఈఏడాది ఫిబ్రవరి 2న యడియూరప్ప ఇంటికి వెళ్లగా తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో సదాశివనగర్ పోలీసులు మార్చి 14న ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు.
భోజనం చేశాక తీరిగ్గా కూర్చుని చల్లటి ఐస్‌క్రీమ్‌ను ఆస్వాదిస్తున్న ఆయన నాలుకకు ఏదో గట్టిగా తగిలింది! అది పళ్ల కింద నలగలేదు.. అంటే డ్రైఫ్రూట్ కాదు. అనుమానమొచ్చి చేత్తో బయటకు తీసి చూసి కంగుతిన్నాడు! అది.. మనిషి చేతి వేలు! ముంబైలోని పశ్చిమ మలాద్ ప్రాంతంలోని ఓర్లెమ్ బెండన్ సెర్రావో అనే 26 ఏళ్ల వైద్యుడికి ఇలా ఒళ్లు గగుర్పొడిచే జుగుప్సాకరమైన, భయానక అనుభవం ఎదురైంది.
గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన రూ.700 కోట్ల కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న రాంచందర్ నాయక్, కల్యాణ్‌ల 3 రోజుల ఏసీబీ కస్టడీ బుధవారం ముగిసింది. చంచల్‌గూడ జైల్లో ఉన్న నిందితులను ఉదయం కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ అనంతరం కోర్టులో హాజరుపరిచి తిరిగి జైలుకు తరలించారు.
గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల కుంభకోణం కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టై జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న తెలంగాణ స్టేట్ లైవ్‌స్టాక్ డెవల్‌పమెంట్ ఏజెన్సీ మాజీ సీఈవో రాంచందర్‌తోపాటు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ జి.కల్యాణ్ కుమార్‌ను ఏసీబీ అధికారులు మూడు రోజుల కస్టడీకి తీసుకున్నారు.