Home » Chandra Babu
గౌరవ సభలోకి సీఎం చంద్రబాబు అడుగు పెట్టగానే.. సభ్యులు లేచి నుంచొని హర్షధ్వానాలు చేస్తూ కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు స్వాగతం పలికారు. అంతకు ముందు అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద సీఎంకు స్వాగతం పలికారు. అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లి చంద్రబాబు నమస్కారం చేశారు. భావోద్వేగ సన్నివేశంతో అనేక మంది ఎమ్మెల్యేలు హర్షధ్వానాలు చేశారు.
శపథాలు చేయడం.. సవాళ్లు విసరడమనేది రాజకీయాల్లో సర్వసాధారణం. అయితే దానిని నెరవేర్చుకోవడమే చాలా కష్టం. అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళితే.. 2021 నవంబర్ 19న అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఓ శపథం చేశారు. దానిని నెరవేర్చుకుని నేడు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు.
జగన్ మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో డ్రైన్లలో తట్ట మట్టి తీయలేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రిగా బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకి మంత్రి నిమ్మల రామానాయుడు ధన్యవాదాలు తెలిపారు. తనను గెలిపించి మంత్రిని చేసిన 70 వేల నియోజకవర్గ కుటుంబాలకు పాదాభివందనం చేస్తున్నానన్నారు.
అమరావతికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నడుం బిగించారు. ఈ క్రమంలోనే నేడు అమరావతిలో చంద్రబాబు పర్యటించనున్నారు. రాజధాని రాష్ట్రానికి.. అద్భుతమైన రాజధాని సిద్ధం కానుంది. ప్రజా వేదిక కూల్చిన ప్రాంతం నుంచే చంద్రబాబు తన పర్యటనను ప్రారంభించనున్నారు.
రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తూ వచ్చిందని.. కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అధికారులు కూడబలుక్కుని ప్రాజెక్టులోని కీలకమైన నిర్మాణాలు కూల్చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.
ఏపీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడంతో వైసీపీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మరోవైపు వైసీపీ నాయకులు సైతం తమ ఓటమిపై రకరకాలుగా స్పందిస్తున్నారు.
పరిపాలనలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రక్షాళన ప్రారంభించారు. సీఎస్, డీజీపీలతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి అధికారుల బదిలీలపై కసరత్తు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన అధికారుల జాబితాను ఇప్పటికే ఏపీ సీఎంఓ సిద్ధం చేసింది.
చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. దీంతో నియోజకవర్గ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు..
పాలనకు సమయం ఇస్తూనే టీడీపీకి సైతం టైం కేటాయించాలనే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రెండు రోజుల పాటు చంద్రబాబు సచివాలయానికి వెళ్లారు. ఈ రోజు తొలిసారి టీడీపీ కార్యాలయానికి అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు..
కుప్పంలో చంద్రబాబు గెలిస్తే ఆయన బూట్ పాలిష్ చేస్తూ, కాళ్ళ దగ్గిరే పడి ఉంటానన్న పిరికి సన్నాసి కొడాలి నాని ఎక్కడ దాక్కున్నాడని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ‘వస్తే రాజ్యం... పొతే సైన్యం’ అన్నట్లుగా జగన్ రెడ్డి వ్యవహారం ఉందన్నారు. సామాజిక న్యాయమంటే ఇదేనా జగన్ రెడ్డి? అని ప్రశ్నించారు.