Home » Chandrababu Naidu
కొత్త ప్రభుత్వం ఏర్పడింది! కానీ... చాలా శాఖల్లో పాత అధికారులే కొనసాగుతున్నారు! కొందరిపైనే దృష్టి సారించి, మార్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా చాలామంది వివాదాస్పద, వైసీపీ అనుకూల అధికారులను ప్రస్తుతానికి అలాగే వదిలేశారు.
కుటుంబం కోసం జల్సా మహల్‌ను కట్టుకున్న జగన్, దానికి సంబంధించిన ఖరీదైన ‘పనుల’ను తన సమీప బంధువుకే అప్పగించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.
చిత్తూరు నగరంలో సోమవారం అన్న క్యాంటీన్ ప్రారంభమైంది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక చేసిన ఐదు సంతకాల్లో అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం కూడా ఉన్న విషయం తెలిసిందే.
ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా పార్టీతో ఉండేది కార్యకర్తలే..వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిగా పనిచేస్తానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గత ఐదేళ్లలో అనేక కష్టాలు పడి, అధికారపక్షం దాడులకు ఎదురొడ్డి నిలబడిన కార్యకర్తలకు అండగా నిలబడతామని కష్టపడిన ప్రతి కార్యకర్తకు సముచిత న్యాయం చేస్తామని చెప్పారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ విశాఖ పార్లమెంటు అధ్యక్షుడిగా సమర్థంగా పనిచేసిన పల్లా తన నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, బీసీ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారుచేసినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి 24,676 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టడం ఇది ఏడోసారి.
‘అహంకారానికి దూరంగా బాధ్యతతో పనిచేద్దాం. ఏ ఆశలు, ఆకాంక్షలతో మనల్ని గెలిపించారో వాటిని నెరవేర్చడానికి చిత్తశుద్ధితో కృషి చేద్దాం. పాలన ఎలా ఉండకూడదో జగన్ చూపించారు. ఎలా ఉండాలో మనం ఒక నమూనాగా... ఆదర్శంగా పనిచేసి చూపిద్దాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే ఐదు హామీలపై చంద్రబాబు సంతకం చేశారని, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ఆయన్ను చూసి నేర్చుకోవాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హితవు పలికారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలవుతున్నా హామీల ఊసే లేదని మండిపడ్డారు.
ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరిగిన సందర్భంగా వేదికపై ఆసీనులైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనను మందిలించారంటూ జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై వివరణ ఇచ్చారు. ఆయన తననేమీ మందలించలేదని, పార్టీ కోసం పనిచేయాలంటూ సూచనలు ఇచ్చారని స్పష్టం చేశారు.