Home » Chandrababu
వైసీపీ నేత జోగి రమేష్ బుధవారం మంగళగిరి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. దాదాపు రెండున్నర గంటలపాటు సాగిన పోలీస్ విచారణ అనంతరం సర్కిల్ కార్యాలయం నుంచి జోగి రమేశ్ సైలెంట్‌గా బయటకు వెళ్లిపోయారు. మీడియాతో సైతం ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ రోజు జరిగిన పోలీస్ విచారణకు తన తరఫు న్యాయవాది, మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, విజయవాడ నగరానికి చెందిన వైసీీపీ నేత పి. గౌతంరెడ్డితో కలిసి జోగి రమేశ్ మంగళగిరి సర్కిల్ కార్యాలయానికి వచ్చారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ (సోమవారం) తొలిసారి నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సోమశిల ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు.
వయనాడ్ బాధితులకు మేమున్నామంటూ ఏపీ సర్కార్(AP Govt) ముందుకు వచ్చింది. కేరళ వయనాడ్ బాధిత కుటుంబాల కోసం ఏకంగా రూ.10కోట్ల విరాళాన్ని అందజేసేందుకు సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) సర్కార్ నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ శుక్రవారం భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై ఇరువరు చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ది, స్వర్ణాధ్రప్రదేశ్- విజన్ 2047 రూపకల్పన అంశాలపై మాట్లాడారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి భేటీ కానున్నారు. ఈ మేరకు ప్రధాని అపాయింట్మెంట్ ఖరారైంది. రేపు (శనివారం) సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ (శుక్రవారం) సాయంత్రం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు.
రాజధాని లేని పరిస్థితి నుంచి 2014లో పాలన ప్రారంభించామని సీఎం చంద్రబాబు తెలిపారు. కొద్దికాలంలోనే నిలదొక్కుకున్నామన్నారు. దేశంలో ఎవ్వరూ ఊహించని విధంగా అభివృద్ధి చెందామన్నారు. 2014-19 మధ్య కాలంలో టాప్-3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచామన్నారు.
సీఎం చంద్రబాబుపై ఉన్న 7 కేసులను సీబీఐకు అప్పగించాలని వేసిన పిటిషన్‌పై హైకోర్ట్‌లో విచారణ జరిగింది. పిటిషన్ విచారణ అర్హతపై అడ్వకేట్ జనరల్ దమ్మాల పాటి శ్రీనివాస్ అభ్యంతరం లేవనెత్తారు. పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేస్తామని ఏజీ చెప్పారు.
ఏపీ అసెంబీ సెషన్ (AP Assembly Session) 5వ రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి.
అవును.. అనుకున్నట్లే జరిగింది..! ఏపీ ప్రజలు కూటమికే ఓటేశారు.. కనివినీ ఎరుగని రీతిలో సీట్లు కట్టబెట్టి అధికారమిచ్చారు. పేరుగాంచిన ప్రాంతీయ, జాతీయ మీడియా.. సర్వే సంస్థలు చేసిన సర్వేలన్నీ అక్షరాలా నిజమయ్యాయి. ఊహించిన దానికంటే ఎక్కువే సీట్లు దక్కాయని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నాయి. ఇక ఎక్కడా చూసినా పసుపు జెండాలే రెపరెపలాడుతున్నాయి.
ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో పోటీ చేయనున్న కూటమి అభ్యర్థిపై ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థి ఎంపికపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు కసరత్తు ప్రారంభించినప్పటికీ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు.