Home » Chhattisgarh
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా శుక్రవారంనాడు విడుదల చేశారు. 'మోదీ కి గ్యారెంటీ 2023' పేరుతో రాయపూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ సోమవారంనాడు పటాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇదే సీటు నుంచి ఆయన ఐదుసార్లు 1993, 1998, 2003, 2013, 2018లో గెలుపొందారు. 2008లో మాత్రం బీజేపీ అభ్యర్థి, తన మేనల్లుడు విజయ్ బఘెల్ చేతిలో ఓటమి చవిచూశారు.
ఛత్తీస్‌గఢ్‌లోని భానుప్రతాప్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కిండర్ గార్డెన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకూ ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు.
ఒక హామీ బీజేపీ 15 ఏళ్ల పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్‌కు 2018 ఎన్నికల్లో పట్టంగట్టింది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ఇప్పుడు మళ్లీ అదే పాచిక బయటకు తీశారు. ఈసారి కూడా ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపిస్తే రాష్ట్రంలోని రైతు రుణాలను మాఫీ చేస్తామని ఆయన సోమవారంనాడు వాగ్దానం చేశారు.
ఛత్తీస్‌గఢ్ లో రెండోసారి అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉధృత ప్రచారానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. బీజేపీ సీనియర్ నేత, మూడుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన రమణ్ సింగ్ సోమవారంనాడు రాజ్‌నంద్‌గావ్ లో నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు మరో ముగ్గురు బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
అనుమానం పెనుభూతం అని అంటారు. భార్యాభర్తలలో ఎవరికైనా ఎవరిమీదైనా అనుమానం కలిగిందంటే అది క్రమంగా పెరుగుతుంది. ఓ భర్త తన భార్య మీద అనుమానంతో కాల్ రికార్డ్ చేసి కోర్టుకు ఇస్తే జరిగింది ఇదీ..
త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘఢ్, తెలంగాణ రాష్ట్రాలకు గాను కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో మొదటి జాబితాలో భాగంగా 144 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ చత్తీస్‌గఢ్ కాంగ్రెస్అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు సిద్ధమైంది. ఈనెల 15వ తేదీన తొలి జాబితాను విడుదల చేయనున్నట్టు ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ శనివారంనాడు తెలిపారు.
ఎన్నికల్లో అభ్యర్థులు గెలుపోటములకు ఒక్క ఓటు కూడా కీలకమే అవుతుంది. అయితే, ఐదు ఓట్ల కోసం ప్రత్యేకంగా ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేసిన వైనం మీకు తెలుసా? దేశంలోనే అతి చిన్న పోలింగ్ బూత్ ఇది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఛత్తీస్‌గఢ్‌లో ఈ పోలింగ్ బూత్ ఉంది.