Home » CM Chandrababu Naidu
చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం డిసెంబర్ 7వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పేరెంట్స్ - టీచర్ మీట్ నిర్వహిస్తుంది. బాపట్ల హైస్కూల్లో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతోపాటు మంత్రి నారా లోకేశ్ పాల్గొనున్నారు.
నాబార్డు చైర్మన్ షాజీ కృష్ణన్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురి మధ్య కీలక చర్చ జరిగింది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి రుణ పరిమితి పెంచుతున్నట్లు నాబార్డు చైర్మన్ తెలిపారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్బంగా రాజధానిలో ఇంటివారవుతున్నారంటూ వారు చేసిన వ్యాఖ్యపై సీఎం చంద్రబాబు సరదా సమాధానం ఇచ్చారు. అది మా ఇంటి హోం మంత్రి(భువనేశ్వరి) కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారని ఆయన చమత్కరించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం రాత్రి విశాఖపట్నం వస్తున్నారు. ఆయన ఆరో తేదీన నోవాటెల్‌లో జరిగే ‘డీప్ టెక్నాలజీ సదస్సు-2024’లో పాల్గొంటారు. దీనిని గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్సఫర్మేషన్ నిర్వహిస్తోంది. దీనికి ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఠక్కర్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
అమరావతి: చంద్రబాబు కుటుంబం రాజధాని వెలగపూడిలో 25 వేల చదరపు గజాల స్థలం కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన స్థలానికి నాలుగు వైపులా రోడ్లు, రాజధానిలోని E 6 రోడ్డుకు ఆనుకుని స్థలం ఉంది. కీలకమైన భవనాలు, గజెటెడ్ అధికారులు, ఎన్జీవో నివాస సముదాయాలు, న్యాయమూర్తుల బంగ్లాలు, తాత్కాలిక హైకోర్టు, విట్, గవర్నమెంట్ కాంప్లెక్స్‌కు దగ్గరలో రెండు కిలోమీటర్లు దూరంలో స్థలం ఉంది.
‘రాష్ట్రంలో డ్రోన్ల వినియోగం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా నేర నియంత్రణ, భద్రతా చర్యల్లో డ్రోన్ల వినియోగం పెంచాలి’ అని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు
కాకినాడ డీప్ వాటర్ పోర్టు, కాకినాడ సెజ్‌ల్లో జగన్ టీమ్ బలవంతపు కబ్జాలపై సీఐడీ విచారణ జరిపించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించినట్లు సమాచారం. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో తన అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ మంగళవారం అమరావతిలో జరిగింది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాల్లో ఒకటైన ఏపీని పోర్టుల హబ్‌గా మార్చే పాలసీలు తీసుకు వస్తున్నట్లు తెలిపింది. దీనిపై వైఎస్ షర్మిల పలు ప్రశ్నలు ఏపీ ప్రభుత్వానికి సంధించింది.
కాకినాడ పోర్టులో ప్రధాన వాటాను లాక్కొని అరబిందో వాళ్లకు కట్టబెట్టడం జగన్ రెడ్డి అరాచకానికి ఉదాహరణ అని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ఈనెల ఆరో తేదీ నుంచి జరగనున్న రెవెన్యూ సదస్సుల్లో వైసీపీ నేతల భూ దందాలపై కూడా ప్రజలు ఫిర్యాదులు ఇవ్వవచ్చని అన్నారు.