Share News

CM Chandrababu: రాజధాని నివాసిగా ఏపీ సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Dec 04 , 2024 | 08:29 AM

అమరావతి: చంద్రబాబు కుటుంబం రాజధాని వెలగపూడిలో 25 వేల చదరపు గజాల స్థలం కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన స్థలానికి నాలుగు వైపులా రోడ్లు, రాజధానిలోని E 6 రోడ్డుకు ఆనుకుని స్థలం ఉంది. కీలకమైన భవనాలు, గజెటెడ్ అధికారులు, ఎన్‌జీవో నివాస సముదాయాలు, న్యాయమూర్తుల బంగ్లాలు, తాత్కాలిక హైకోర్టు, విట్, గవర్నమెంట్ కాంప్లెక్స్‌కు దగ్గరలో రెండు కిలోమీటర్లు దూరంలో స్థలం ఉంది.

CM Chandrababu: రాజధాని నివాసిగా ఏపీ సీఎం చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) ఇక రాజధాని అమరావతి (Amaravati) నివాసిగా (Resident) ఉండబోతున్నారు. చంద్రబాబు కుటుంబం (Chandrababu Family) రాజధాని వెలగపూడి (Velagapudi)లో 25 వేల చదరపు గజాల స్థలం కొనుగోలు చేసింది. ఆ స్థలంలో భూ సార పరీక్షలు చేయిస్తున్నారు. ఆ స్థలంలో గృహం, భద్రత సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగ్, లాన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒకే కుటుంబంలోని ముగ్గురు సభ్యుల నుంచి స్థలం కొనుగోలు చేశారు. చంద్రబాబు కొనుగోలు చేసిన స్థలానికి నాలుగు వైపులా రోడ్లు, రాజధానిలోని E 6 రోడ్డుకు ఆనుకుని స్థలం ఉంది. కీలకమైన భవనాలు, గజెటెడ్ అధికారులు, ఎన్‌జీవో నివాస సముదాయాలు, న్యాయమూర్తుల బంగ్లాలు, తాత్కాలిక హైకోర్టు, విట్, గవర్నమెంట్ కాంప్లెక్స్‌కు దగ్గరలో రెండు కిలోమీటర్లు దూరంలో స్థలం ఉంది. మొత్తం 5 ఎకరాలు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే రైతులకు డబ్బు చెల్లించారు. త్వరలో రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.


ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం కృష్ణా నది ఒడ్డున ఉండవల్లి కరకట్ట మార్గంలోని లింగమనేనికి చెందిన గెస్ట్‌హౌస్‌లో ఉంటున్నారు. గత పదేళ్లుగా ఆయన ఈ నివాసంలోనే ఉంటున్నారు. అమరావతి నిర్మాణం కొలిక్కి వచ్చాక సొంతిల్లు నిర్మించుకుంటానని గతంలో చెప్పారు. ఈ క్రమంలో తాజాగా భూమిని కొనుగోలు చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా సొంత ఇంటిని నిర్మిస్తున్నారు. ఆ ఇంటి పనుల్ని వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. త్వరలోనే ఈ ఇంటి నిర్మాణం పూర్తి చేయనున్నారు. ఇప్పుడు అమరావతిలో కూడా చంద్రబాబు ఇంటి నిర్మాణం కోసం స్థలం కొనుగోలు చేశారు. సీఎం చంద్రబాబు ఎక్కువ సమయంలో అమరావతిలోనే ఉంటున్నారు. ఆయనకు అమరావతిలో శాశ్వత నివాసం లేదనే వైఎస్సార్‌సీపీ నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. అందుకే రాజధానిలో సొంతంగా ఇంటి నిర్మాణం చేసే పనిలో ఉన్నారు.


శరవేగంగా అమరావతి అభివృద్ధి

కాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రూ.11,467 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారని మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. రూ.2,498 కోట్లతో ట్రంక్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామన్నారు. సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ 41వ అథారిటీ సమావేశం జరిగిందన్నారు. మొత్తం 23 అంశాలు ఎజెండాగా ఈ సమావేశం కొనసాగిందని తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. త్వరలో ఐకానిక్ టవర్స్ నిర్మాణ ప్రక్రియ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. వరద నివారణకు రూ.1,585 కోట్లతో పాల వాగు, కొండవీటి వాగు పనులు చేపడతామని వివరించారు.

గ్రావిటీ కెనాల్‌తో పాటు రిజర్వాయర్ల నిర్మాణానికి సైతం ఆమోదం తెలిపారని మంత్రి నారాయణ అన్నారు. గెజిటెడ్, నాన్ గెజిటెడ్, క్లాస్ - 4, ఆలిండియా సర్వీస్ అధికారుల భవనాల నిర్మాణ పనులను రూ.3,523కోట్లతో చేపట్టేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని చెప్పారు. అలాగే రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ లేఅవుట్‌లలో రహదారులు, మౌలిక వసతుల కల్పనకు రూ.3,859 కోట్లతో అనుమతి ఇచ్చామన్నారు. జనవరిలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇక గత వైసీపీ ప్రభుత్వం రాజధాని అమరావతితో మూడు ముక్కలాట ఆడిందని విమర్శించారు.

కాగా ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో జరిగిన ఎన్నికల్లో కూటమికి ప్రజలు పట్టం కట్టారు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తిరింది. దీంతో గత జగన్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా ఆగిపోయిన రాజధాని అమరావతి నిర్మాణ పనులకు మళ్లీ పూర్వ వైభవం వచ్చినట్లు అయింది. ఓ వైపు కేంద్రం తోడ్పాటు, మరోవైపు సీఎం చంద్రబాబు దార్శనికతతో అమరావతి నిర్మాణ పనులు ఊపందుకొంటున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

కోహ్లీకి గాయం.. రెండో టెస్ట్‌కు డౌట్..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో టీం..

బెదిరించి, భయపెట్టి కొట్టేశారు

శ్రద్ధా ఇంటి రెంట్‌ ఎంతో తెలుసా..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 04 , 2024 | 08:29 AM