-
-
Home » Andhra Pradesh » Breaking News December 4th Today Latest Telugu News Live Updates Amar
-
PSLV C-59: రాకెట్ ప్రయోగం వాయిదా.. కారణమిదే..
ABN , First Publish Date - Dec 04 , 2024 | 09:37 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
Live News & Update
-
2024-12-04T17:12:00+05:30
కాంగ్రెస్ సర్కార్‌పై కవిత కన్నెర్ర..
మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ. 2500 ఇవ్వాల్సిందే: ఎమ్మెల్సీ కవిత
మహాలక్ష్మీ కింద రూ. 2500 ఇవ్వడంతో పాటు గత 12నెలల కాలానికి గానూ బాకీ పడ్డ రూ 30వేలు చెల్లించాలి.
ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ ను రూ 4వేలకు పెంచాలి.. ఇప్పటి వరకు పెంచని కారణంగా బాకీ పడ్డ రూ. 24000 వేలు కూడా చెల్లించాల్సిందే.
రేవంత్ ముఖ్యమంత్రి అయ్యి ఏడాది అయినా నాగార్జునసాగర్ డ్యాం సీఆర్పీఎఫ్ అధీనంలోనే ఉన్నది.. ప్రాజెక్టును ఇప్పటికీ తెలంగాణ అధీనంలోకి తేలేదు.
తెలంగాణ నీళ్ల మీద రేవంత్ రెడ్డి ఆయన గురువు గారిని ఎందుకు ప్రశ్నించడం లేదు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేయొద్దని గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చినా పనులు కొనసాగుతున్నాయి.
రేవంత్ సీఎం అయిన తర్వాత ఆరు నెలల పాటు ఒక్క ప్రాజెక్టులో స్పూన్ మట్టి కూడా తియ్యలేదు.
-
2024-12-04T15:37:51+05:30
PSLV C-59: రాకెట్ ప్రయోగం వాయిదా.. కారణమిదే..
నెల్లూరు: షార్ రాకెట్ ప్రయోగ కేంద్రంలో ఇవాళ సాయంత్రం 4.08 గంటలకి జరగాల్సిన PSLV C -59 రాకెట్ ప్రయోగం వాయిదా.
రేపు ప్రయోగించే అవకాశం.
శాటిలైట్ ప్రోబ్ - 3లో తలెత్తిన సాంకేతిక లోపం.
ప్రోబ్ - 3 ని రూపొందించిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ.
సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా వేసినట్లు సమాచారం.
ప్రోబ్ - 3 శాటిలైట్ సాంకేతిక లోపం సరిచేస్తున్న యూరోపియన్, ఇస్రో శాస్త్రవేత్తలు.
రేపు సాయంత్రం 4.12 గంటలకి ప్రయోగం చేపట్టనున్న ఇస్రో.
-
2024-12-04T15:10:48+05:30
నన్ను అరెస్ట్ చేయొద్దు.. హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు..
పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసు కొట్టివేయాలని హైకోర్టులో హరీష్ రావు పిటిషన్.
సిద్దిపేట నేత చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిసెంబర్ 1న హరీష్ రావుపై కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు.
హరీష్ రావు తన ఫోన్ ట్యాప్ చేయించారని చక్రధర్ ఫిర్యాదు.
హరీష్ రావుతో పాటు మాజీ డిసిపి రాధాకృష్ణన్ రావుపై కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు.
రాజకీయ కక్షతోనే తనపై కేసు నమోదు చేశారని పిటిషన్‌లో పేర్కొన్న హరీష్ రావు.
నిరాధార ఆరోపణలు చేసి సంబంధం లేని కేసులో వినిపించారని హరీష్ రావు పిటిషన్.
కేసు కొట్టివేయడంతో పాటు అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరిన హరీష్ రావు.
-
2024-12-04T14:28:21+05:30
ఏపీ సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌గా పెందుర్తి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం కోఆర్డినేటర్‌గా పెందుర్తి వెంకటేష్ నియామకం
చంద్రబాబు నాయుడు కార్యక్రమాల నిర్వహణకు కోఆర్డినేటర్‌ను నియమించిన ప్రభుత్వం
రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ను సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్‌గా కేబినెట్ ర్యాంక్‌తో నియమిస్తూ ఉత్తర్వులు జారీ
-
2024-12-04T14:21:09+05:30
ఏసీబీ దాడి..
నిర్మల్ జిల్లా మార్కెటింగ్ అధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడి
రూ. 7వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్
-
2024-12-04T14:05:24+05:30
అవనిగడ్డలో మంత్రి నాదేండ్ల మనోహర్ పర్యటన
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటిస్తున్న పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
చల్లపల్లి మండలం మాజేరులో రోడ్ల పక్కన ఆరబోసిన కల్లాలను పరిశీలించి రైతులతో మాట్లాడిన మంత్రి నాదెండ్ల మనోహర్
ఆరబోసిన ధాన్యం పరిశీలించి వీఏఏ, టీఏలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి
-
2024-12-04T14:05:23+05:30
సత్తెనపల్లిలో కొణిజేటి రోశయ్య వర్ధంతి కార్యక్రమం
సత్తెనపల్లి లో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వర్ధంతి కార్యక్రమం..
తాలూకా సెంటర్‌లోని రోశయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ
-
2024-12-04T14:05:22+05:30
గడపగడపకు వస్తున్నా..
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో మీ కోసం గడపగడపకు వస్తున్నా కార్యక్రమాన్ని ప్రారంభించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
తొలిరోజు గడపగడపకు యాత్రలో పాల్గొన్న వేలాది మంది టీడీపీ కార్యకర్తలు.
ఏడాదిపాటు గ్రామాల్లో పర్యటించనున్న గిరిధర్ రెడ్డి
-
2024-12-04T14:05:21+05:30
ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కామెంట్స్
ప్రభుత్వ, ప్రజల ఆస్తుల రక్షణకు తొలి ప్రాధాన్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు
పరాయి భూములపై కన్నేయాలంటేనే భయపడేలా సమగ్ర భూకబ్జాల నియంత్రణ చట్టం
భూహక్కుల సమస్యల్లేని రాష్ట్రమే లక్ష్యంగా ప్రతిష్ఠాత్మకంగా 6 నుంచి రెవెన్యూ సదస్సులు
రెవెన్యూ అధికారులే గ్రామాలకు వస్తారన్న జీవీ ఆంజనేయులు
45రోజుల్లోనే భూసమస్యలు పరిష్కరిస్తామన్న ఆంజనేయులు
-
2024-12-04T14:05:20+05:30
ఏపీలో ఉచిత విద్యుత్తు అందిస్తున్నాం..
ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
200 యూనిట్ల వరకు ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్న మంత్రి
అర్హులైన ప్రతి ఒక్కరూ దీనిని వినియోగించుకోవచ్చన్న మంత్రి
రూ.15,17,298 ఎస్సీ కుటుంబాలకు, 4,75,557 ఎస్టీ కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తోందన్న మంత్రి
ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకాన్ని తెలుగుదేశం ప్రభుత్వమే ప్రవేశపెట్టిందన్న మంత్రి
ఎస్సీ, ఎస్టీలకు అందించే ఉచిత విద్యుత్‌పై అసత్య ప్రచారాలు నమ్మవద్దన్న మంత్రి
-
2024-12-04T14:05:19+05:30
ఢిల్లీకి బయలుదేరిన రాహుల్, ప్రియాంక
ఘాజీపూర్ బోర్డర్ నుంచి ఢిల్లీ బయలుదేరిన రాహుల్, ప్రియాంక గాంధీ , పార్టీ నేతలు
సంబాల్‌లో హింసకాండకు గురైన బాధితుల కుటుంబాలను పరామర్శించెందుకు వెళ్లిన రాహుల్ గాంధీని అడ్డుకున్న పోలీసులు.
పోలీసులు అడ్డుకోవడం తో తిరిగి ఢిల్లీకి బయలుదేరి రాహుల్, ప్రియాంక గాంధీ
-
2024-12-04T14:05:18+05:30
అంగన్వాడీ టీచర్‌పై పెట్రోల్‌తో దాడి
అంగన్వాడీ టీచర్ రెహం తున్నీసాపై పెట్రోల్ తో దాడి..
విశాఖపట్టణంలోని 43 వ వార్డు శ్రీనివాస నగర్ వద్ద ఘటన
అంగన్వాడీ టీచర్‌పై మరో మహిళ దాడి చేసినట్లు స్థానికుల సమాచారం
అంగన్వాడీ కేంద్రానికి సమీపంలో ఉన్న ఆటోలో కూర్చుని టీచర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన మరో మహిళ
ఈ ఘటనలో దాడి చేసిన మహిళకు స్వల్ప గాయాలు
స్థానికులు బయటికి రావడంతో ద్విచక్ర వాహనాన్ని వదిలి అక్కడి నుంచి పరారైన మహిళ
ముఖం నుంచి కాలి వరకు గాయాలు
-
2024-12-04T14:05:17+05:30
కలెక్టర్లతో రెవెన్యూ మంత్రి వీడియో కాన్ఫరెన్స్
మంగళగిరిలోని సీసీఎల్ఏ కార్యాలయంలో జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్
ఈనెల 6 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్న నేపథ్యంలో కలెక్టర్లకు పలు సూచనలు చేసిన మంత్రి అనగాని సత్యప్రసాద్
అన్ని రకాల భూ సమస్యలపై రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలన్న మంత్రి అనగాని
భూ వివాదాలకు ముగింపు పలికే విధంగా రెవెన్యూ సదస్సులు జరగాలన్న మంత్రి
రెవెన్యూ సదస్సులను మొక్కుబడి కార్యక్రమంగా మార్చవద్దంటూ అధికారులకు మంత్రి అనగాని హితవు
రెవెన్యూ సదస్సులో భూ దురాక్రమణలు, 22a భూముల ఉల్లంఘనపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న మంత్రి అనగాని
-
2024-12-04T14:05:16+05:30
బాధ్యతలు స్వీకరించిన గుమ్మడి గోపాలకృష్ణ
ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన గుమ్మడి గోపాలకృష్ణ
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్
కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమాన్ని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈనెల 6 ,7 ,8 తేదీలలో నిర్వహిస్తున్నామన్న మంత్రి దుర్గేష్
ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ,చంద్రబాబు, రాష్ట్రం నలుమూలల నుంచి కళాకారులు వస్తారన్న మంత్రి
పర్యాటక రంగానికి రూ.177 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరి చేసిందన్న మంత్రి
తూర్పుగోదావరి జిల్లా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్న మంత్రి
-
2024-12-04T13:39:01+05:30
కర్నూలులో చైన్ స్నాచర్స్ హల్‌చల్
కర్నూలు నగరంలో చైన్ స్నాచర్స్ హల్‌చల్
బాలాజీ నగర్‌లో ఆటో స్టాండ్ సమీపంలో ఇంటి ముందు ముగ్గు వస్తుండగా మహిళ మెడలో నాలుగు తులాల బంగారు గొలుసు చోరీ
నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో రిటైర్డ్ తహసీల్దార్ చెంచమ్మ పాలు తీసుకొని ఇంటికి వెళ్తుండగా మూడున్నర తులాల బంగారు గొలుసు లాక్కెళ్లిన దుండగులు
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
-
2024-12-04T13:35:03+05:30
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది విచారణ
రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు జిజిహెచ్ సిబ్బందిని విచారించనున్న ఎస్పీ దామోదర్
మధ్యాహ్నం ఒంటి గంటకు ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణ
విచారణకు హాజరు కావాలని జిజిహెచ్ ఆర్‌ఎంవో సతీష్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజేంద్ర, ఈసీజీ టెక్నీషియన్ నాగరాజుకి నోటీసులు ఇచ్చిన ఎస్పీ దామోదర్
రఘురామ కృష్ణంరాజు వైద్య నివేదికని అప్పటి జిజిహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి ట్యాంపరింగ్ చేశారని ఆరోపణ
-
2024-12-04T11:02:07+05:30
ప్రియుడి ఇంటిముందు ప్రియురాలు ధర్నా
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడెకల్ గ్రామంలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా
అజయ్ అనే యువకుడు తనను పెళ్లి చేసుకొని మోసం చేసాడంటున్న యువతి ప్రమీల
తనకు న్యాయం చేయాలని డిమాండ్
ఇంటికి తాళం వేసి వెళ్లి పోయిన అజయ్ కుటుంబ సభ్యులు
-
2024-12-04T10:05:55+05:30
ఉపాధ్యాయుడుపై చర్యలు
మంచిర్యాలలో ఉపాధ్యాయుడు సత్యనారాయణ పై వేటు,
సస్పెండ్ చేసిన జిల్లా విద్యాధికారి
జిల్లా కేంద్రంలోని జిల్లాపరిషత్తు బాలికల ఉన్నత పాఠశాలలో బాలికల పట్ల అసభ్యం గా ప్రవర్తించిన తెలుగు టీచర్ తాడోజు సత్యనారాయణ,
మంగళవారం టీచర్‌ను పట్టుకుని రోడ్డుపై చెప్పుతో దేహశుద్ధి చేసిన బాలిక తల్లిదండ్రులు
-
2024-12-04T10:03:17+05:30
మాజీ డిప్యూటీ సీఎంపై హత్యాయత్నం
అమృతసర్ గోల్డెన్ టెంపుల్‌లో మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పుల కలకలం
గేట్ బయట కూర్చున్న ఆయనను కాల్చేందుకు ప్రయత్నించిన గుర్తు తెలియని వ్యక్తి
తుపాకీతో కాల్చేందుకు యత్నించగా అడ్డుకున్న స్థానికులు
గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపిన నిందితుడు
-
2024-12-04T09:50:33+05:30
PSLV C -59 రాకెట్ ప్రయోగానికి సర్వ సిద్దం
ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఇవాళ సాయంత్రం 4:08గంటలకి PSLV C -59 రాకెట్ ప్రయోగం
ఫస్ట్ లాంఛ్ ప్యాడ్ నుంచి ప్రయోగానికి ఏర్పాట్లు
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబ్ -3 ఉపగ్రహాన్ని నింగిలో చేర్చనున్న PSLV C-59 రాకెట్
సూర్య గ్రహణాలని సృష్టించే పరిశోధనల కోసం ప్రోబ్ - 3 ఉపగ్రహాన్ని రూపకల్పన చేసిన యూరోపియన్ శాస్త్రవేత్తలు
కొనసాగుతున్న కౌంట్ డౌన్
షార్ కి చేరుకున్న ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాధ్
యూరోపియన్ ఉపగ్రహాన్ని నింగిలోకి చేర్చి మరో రికార్డుని సొంతం చేసుకోనున్న ఇస్రో
-
2024-12-04T09:48:27+05:30
స్టెల్లా నౌక వద్దకు అధికారుల బృందం
కాకినాడ నుంచి స్టెల్లా నౌక వద్దకు బయలుదేరిన అధికారుల బృందం
కాసేపట్లో నౌకలో మిగిలిన బియ్యం పరిశీలన
బియ్యం శాంపిల్స్ సేకరించి ల్యాబ్ లో పరిశీలించనున్న అధికారులు
నౌకలో ఎంత రేషన్ బియ్యం ఉన్నాయో గుర్తించి సీజ్ చేసి నౌకను పంపించేలా ఏర్పాట్లు
నౌకలో పూర్తి బియ్యం లోడింగ్ కు ఇంకా వారం పట్టే అవకాశం
-
2024-12-04T09:46:43+05:30
829 మందికి షోకాజ్ నోటీసులు
కడప జిల్లాలో 829 మంది హెడ్మాస్టర్లకు షోకాజ్ నోటీసులు
నోటీసులు జారీచేసిన డీఈఓ మీనాక్షి
వివాదస్పదంగా మారిన డీఈఓ వ్యవహారశైలి
సాంకేతిక సమస్యకు తాము ఎలా బాధ్యులవుతామంటున్న ఉపాధ్యాయులు
కడప డీఈవో వ్యవహార శైలి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా ఉందన్న టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి
డీఈవోపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామంటున్న ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి