Home » Collages
ప్రిన్సిపాల్ తమపై వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఓ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ విద్యార్థినులు రాస్తారోకోకు దిగారు. ఆ మహిళా ప్రిన్సిపాల్‌ను వెంటనే మార్చాలంటూ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ఈ ఘటన సుర్యాపేట జిల్ల్లా కేంద్రం సమీపంలోని బాలెంలలోని డిగ్రీ కళాశాలలో జరిగింది.
మాజీ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎలాంటి అనుమతులు లేకుండా బాలానగర్‌లో ఏర్పాటు చేసిన మల్లారెడ్డి యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కామర్స్ అండ్ డిజైన్ (ఆఫ్ క్యాంప్‌స)పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), రాష్ట్ర ఉన్నతవిద్యామండలికి ఆదేశాలు జారీచేసింది.
జేఎన్టీయూ నుంచి అఫిలియేషన్ కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల యాజమాన్యాలకు ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ బుర్రా వెంకటేశం సూచించారు.
విద్యార్థుల విషయంలో జేఎన్టీయూ అధికారుల నిర్లక్ష్యం రోజుకో రకంగా వెలుగులోకి వస్తోంది. మొన్నటికి మొన్న హైదరాబాద్ జేఎన్టీయూ క్యాంటీన్లో కాలం చెల్లిన బియ్యం పిండితో ఆహార పదార్థాలు తయారుచేసినట్లు వెల్లడి కాగా,
తెలంగాణ రాష్ట్రాన్ని మెడికల్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందిందని, విద్య, వైద్యం, విద్యుత్తు నిరంతరం ఉండటంతోపాటు ఫార్మా, ఐటీ, టూరిజం, విద్యాసంస్థలు నగరాన్ని ఆ స్థాయిలో నిలిపాయని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఉండాలని, తదనుగుణంగా చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జూనియర్ డాక్టర్ల డిమాండ్ల నేపథ్యంలో రాష్ట్రంలో మూడు పాత మెడికల్ కాలేజీలకు రూ.204 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈమేరకు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ బుధవారం ఉత్తర్వులిచ్చారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కానున్న 8 వైద్య కళాశాలను జాతీయ వైద్య కమిషన్ బృందాలు తనిఖీ చేశాయి. రాష్ట్రానికి సోమవారం ఉదయం 8 బృందాలు రాగా... ఒక్కో బృందంలో నలుగురు సభ్యులు ఉన్నారు.
ఇంటికి, అమ్మానాన్నకు దూరంగా హాస్టల్లో ఉంటూ చదువుకోవడం ఆ బాలుడికి చాలా భయంకరంగా అనిపించింది. తన కష్టాన్ని అమ్మకు చెబితే.. కొడుకు భవిష్యత్తు కోసం ఆ తల్లి నచ్చజెప్పింది. కానీ, హాస్టల్లో ఉండే దైర్యం చేయలేకపోయిన ఆ బాలుడు అక్కడి నుంచి పారిపోయేందుకు సాహసించి ప్రాణాలు కోల్పోయాడు.
వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం పార్ట్‌టైమ్ బీటెక్ ప్రోగ్రామ్‌ల నిర్వహణకు జేఎన్టీయూ పచ్చజెండా ఊపింది. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ప్రొఫెషనల్స్ తమ ఉద్యోగాలు చేస్తూనే బీటెక్ కోర్సులను అభ్యసించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) మార్గం సుగమం చేసింది.