Share News

Hyderabad: కొత్త మెడికల్‌ కాలేజీల్లో ఎన్‌ఎంసీ తనిఖీలు ..

ABN , Publish Date - Jun 25 , 2024 | 04:52 AM

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కానున్న 8 వైద్య కళాశాలను జాతీయ వైద్య కమిషన్‌ బృందాలు తనిఖీ చేశాయి. రాష్ట్రానికి సోమవారం ఉదయం 8 బృందాలు రాగా... ఒక్కో బృందంలో నలుగురు సభ్యులు ఉన్నారు.

Hyderabad: కొత్త మెడికల్‌ కాలేజీల్లో ఎన్‌ఎంసీ తనిఖీలు ..

  • అధ్యాపకుల హాజరు శాతం తగ్గడంపై అభ్యంతరం

  • వెంటనే కొత్త వారిని నియమించుకోవాలని సూచన

హైదరాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కానున్న 8 వైద్య కళాశాలను జాతీయ వైద్య కమిషన్‌ బృందాలు తనిఖీ చేశాయి. రాష్ట్రానికి సోమవారం ఉదయం 8 బృందాలు రాగా... ఒక్కో బృందంలో నలుగురు సభ్యులు ఉన్నారు. కొత్తగా ఏర్పాటవుతున్న అన్ని కాలేజీల్లోనూ అధ్యాపకుల హాజరు 70శాతం లేకపోవడంపై ఎన్‌ఎంసీ బృందాలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తక్షణమే కొత్త అధ్యాపకులను నియమించుకోవాలని సూచించినట్లు సమాచారం.


ఈ అంశాన్నే ఎన్‌ఎంసీకి ఇచ్చే నివేదికలో ప్రస్తావిస్తామని ఆ బృందాలు చెప్పినట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఈ బృందాలు వేర్వేరుగా ఎన్‌ఎంసీకి నివేదికలు ఇస్తాయి. వాటి ఆధారంగా ఏమైనా లోపాలుంటే సరి చేసుకునేందుకు మరో అవకాశం ఇస్తారు. అప్పటికీ మార్పు రాకపోతే సదరు కాలేజీకి అనుమతులు మంజూరు చేయరు. కౌన్సెలింగ్‌ ప్రారంభమయ్యేలోగా కొత్త కాలేజీలకు కచ్చితంగా అనుమతులు రావాల్సి ఉంటుంది. అప్పుడే ఆయా కాలేజీల్లో చేరికకు ఆప్షన్‌ పెట్టుకునే ఆస్కారం ఉంటుంది.

Updated Date - Jun 25 , 2024 | 04:52 AM