Share News

Damodara Rajanarsimha: ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ఆరోగ్య కేంద్రం..

ABN , Publish Date - Jun 28 , 2024 | 05:37 AM

రాష్ట్రంలోని ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఉండాలని, తదనుగుణంగా చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Damodara Rajanarsimha: ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ఆరోగ్య కేంద్రం..

  • సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

  • డీఎంహెచ్‌వోలతో సమీక్షలో మంత్రి దామోదర

హైదరాబాద్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఉండాలని, తదనుగుణంగా చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పేదవాడికి మెరుగైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కార్యాలయంలో డీఎంహెచ్‌వోలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను అందించడంలో డీఎంహెచ్‌వోలది గురుతర బాధ్యత అని, ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంతో ఉండాలన్నారు.


ఆస్పత్రులను వైద్య సేవలపరంగా జిల్లా, ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అనుసంధానించాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని ప్రైవేటు ఆస్పత్రుల లైసెన్సులను రద్దు చేయాలని సూచించారు. క్లినికల్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ యాక్ట్‌, గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్‌పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు.

Updated Date - Jun 28 , 2024 | 05:44 AM