Home » Congress Govt
ఖమ్మంలో అక్రమ నిర్మాణాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యంత్రాంగం చాలా బాగా పనిచేసిందని ప్రశంసించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని తన కుటుంబ సభ్యులకు వందల కోట్ల రూపాయల టెండర్‌ను కట్టబెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్లకుంట్ల తారక రామారావు ఆరోపించారు. సీఎం రేవంత్ ఇలా చేయడం ముమ్మాటికి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరమని అన్నారు. రేవంత్ కుటుంబ సభ్యులకు అనుచితమైన ఆర్థికలబ్ధిని కలిగించేందుకు తన పదవిని అడ్డు పెట్టుకోవడం అనేది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద కూడా నేరమని కేటీఆర్ ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు(స్మార్ట్ కార్డ్) ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టులు చేపట్టేందుకు అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది.
రూ.2 లక్షలు పైన ఉన్న రైతులకు కూడా రుణమాఫీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రైతులకు మొదటి పంట కాలంలోనే రుణమాఫీ చేశామని అన్నారు. భారతదేశంలో అత్యధికంగా తెలంగాణలో కోటీ 50 లక్షల మెట్రిక్ టన్నుల వరిని రైతులు పండిస్తున్నారని వెల్లడించారు. సంక్రాంతి నుంచి సన్నబియ్యం ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.
అన్నదాతకు రేవంత్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సన్నాల వడ్లకు బోనస్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు.
కోమటిరెడ్డి లాంటి నేతలు ఎంతమంది వచ్చిన బీఆర్ఎస్ పార్టీని ఏం చేయలేరని బీఆర్ఎస్ సీనియర్ నేత గొంగడి సునీత అన్నారు. కోమటిరెడ్డి కుటుంబంలో గొడవలను ఆయన మొదటగా పరిష్కరించుకోవాలని గొంగడి సునీత హితవు పలికారు.
రాష్ట్రంలో త్వరలో ఫ్యామిలీ డిజిటల్ కార్డును తీసుకురాబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రతి కుటుంబానికీ ఈ కార్డును ఇస్తామని, దీని ద్వారానే రేషన్, ఆరోగ్యశ్రీ, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాల లబ్ధిని ఆయా కుటుంబాలకు అందజేస్తామని పేర్కొన్నారు.
అమృత్ టెండర్లలో అక్రమాలు నిరూపిస్తే.. మంత్రి పదవికి రాజీనామా చేస్తానని పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చేసిన సవాల్‌కు కేటీఆర్ సమాఽధానం చెప్పలేక దాటవేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు.
రాష్ట్రంలో సర్కారీ దవాఖానాలపై రాజకీయాలు చేస్తున్నారు. పెద్దాస్పత్రులపై ప్రజలు నమ్మకం కోల్పోయేలా చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే ప్రాణాలు పోతాయన్న భయాన్ని పేదల్లో కల్పిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉగ్రవాదులను పెంచి పోషించేది మజ్లిస్ పార్టీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఒవైసీకి చెందిన కాలేజీలో పని చేసిన ఓ ఫ్యాకల్టీని ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడని గతంలో అరెస్టు చేశారని గుర్తుచేశారు.