Sudheer Reddy: మూసీ సుందరీకరణ.. సర్కార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఫైర్
ABN , Publish Date - Oct 19 , 2024 | 11:41 AM
Telangana: మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండేవారిని ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చి వెళ్లిపోవాలని చెప్పడం సరికాదన్నారు. మూసీలో 90శాతం హైదరాబాద్ మురుగు చేరుతుందని తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 19: మూసీ సుందరీకరణ అంటూ ప్రభుత్వం (Congress Govt) తీసుకువచ్చిన ఓ కార్యక్రమం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. మూసీ సుందరీకరణ పేరుతో అక్కడ ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించడం పట్ల ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో మూసీ ప్రాజెక్ట్ విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నిత్యం మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసమే మూసీ సుందరీకరణ కార్యక్రమం చేపట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. అయితే మూసీ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా మూసీ సుందరీకరణపై మూసీ డెవలప్‌మెంట్ మాజీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి (MLA Sudheer Reddy) స్పందించారు.
KTR: కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను టార్గెట్ చేస్తూ కేటీఆర్ ట్వీట్..
మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండేవారిని ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చి వెళ్లిపోవాలని చెప్పడం సరికాదన్నారు. మూసీలో 90శాతం హైదరాబాద్ మురుగు చేరుతుందని తెలిపారు. దానిని శుద్ధి చేసేందుకు మంచి వాతావరణం అందించేందుకు రూ.3800 కోట్లతో 31 ఎస్‌టీపీలు గత ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తుచేశారు. పలు ఎస్‌టీపీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. పాతవి కొత్తవి కలిపితే 1900 ఎమ్‌ఎల్‌డీల మురుగు శుద్ధి అవుతుందని చెప్పుకొచ్చారు. దాంతో నల్గొండ వాసులకు కూడా మేలు చేకూరుతుందన్నారు.
Hyderabad: గబ్బు రేపుతున్న హైదరాబాద్ పబ్బులు..
మూసీ రివర్ బోర్డు నియమించి మూసీ మార్కింగ్ చేసింది బఫర్ జోన్ గుర్తించింది తామే అని వెల్లడించారు. మూసీపై 15 బ్రిడ్జిల నిర్మాణం కూడా చేపట్టాలని గత ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మూసీ పరిధిలో ఒక్కొక్క ఇంట్లో నాలుగై కుటుంబాలు ఉన్నాయన్నారు. వాళ్లకు నష్టం కలగకుండా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం మూసీ సుందరీకరణలో ఎవ్వరినీ ఇబ్బందులు పెట్టలేదని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Delhi Liquor Case: రౌస్ ఎవిన్యూ కోర్టులో లిక్కర్ పాలసీ కేసు విచారణ.. హాజరుకానున్న కవిత..
TG News: ముగ్గురు యువకుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు చూస్తే..
Read Latest Telangana News And Telugu News