Share News

Bandi Sanjay: జీవో 29 వెనుక భారీ కుట్ర.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Oct 19 , 2024 | 05:44 PM

నిరుద్యోగుల ఆందోళనపై బీఆర్‌ఎస్‌ కుట్ర చేసిందని కేంద్రమంత్రి బండి సంజయ్‌ మండిపడ్డారు. ర్యాలీలో చొరబడి గొడవలు సృష్టించాలని బీఆర్‌ఎస్‌ నేతలు చూశారని అన్నారు.నిరుద్యోగుల ముసుగులో గొడవలు సృష్టించాలనుకున్నారని విమర్శించారు.

Bandi Sanjay: జీవో 29 వెనుక భారీ కుట్ర.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్

హైదరాబాద్: జీవో 29 వెనుక భారీ కుట్ర దాగి ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. గ్రూప్‌-1 పరీక్ష రద్దు చేయాలని ఎవరూ కోరలేదని చెప్పారు. రీషెడ్యూల్‌ చేయాలని మాత్రమే అభ్యర్థులు కోరుతున్నారని అన్నారు. విద్యార్థుల మీద పెట్టిన కేసులను రేవంత్ ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని కోరారు. లేకపోతె తాను మళ్లీ అశోక్ నగర్ వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇవాళ(శనివారం) బీజేపీ కేంద్ర కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ... జీవో 29పై కాంగ్రెస్‌ ప్రభుత్వం తన వైఖరి చెప్పాలని ప్రశ్నించారు. అభ్యర్థుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు రద్దు చేస్తారేమోనని అభ్యర్థులు భయపడుతున్నారని చెప్పారు. నిరుద్యోగుల ఆందోళనపై బీఆర్‌ఎస్‌ కుట్ర చేసిందని మండిపడ్డారు. గ్రూప్‌-1 అభ్యర్థులు చేస్తున్న ర్యాలీలో చొరబడి గొడవలు సృష్టించాలని బీఆర్‌ఎస్‌ నేతలు చూశారని విమర్శలు చేశారు. నిరుద్యోగుల ముసుగులో గొడవలు సృష్టించాలనుకున్నారని బండి సంజయ్‌ ధ్వజమెత్తారు.


కేటీఆర్ మీ అయ్యా పరువు తీశావ్...

‘‘నన్ను అరెస్ట్ చేసే దమ్ము తెలంగాణలో ఎవడికి ఉంది.నన్ను అరెస్ట్ చేయలేదు.. అడ్డుకున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ మీ అయ్యా పరువు తీశావ్. నీదో బతుకు , నీ అహంకారం వల్లే నీ అయ్యకు ఈ గతి పట్టింది.నేను పేపర్ లీకేజి చేసినట్లు రుజువు చేయ్. నా సవాల్ స్వీకరించు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది . నీ బతుకు గురించి నాకు మొత్తం తెలుసు. అశోక్ నగర్ వస్తా అని ఎందుకు రాలేదు. డ్రగ్స్‌‌తో నీకు సంబంధం లేదని నిరుపించుకో. అయ్యా పేరు చెప్పి నేను రాజకీయాల్లోకి రాలేదు. మీదో బతుకు ఛీ. కాంగ్రెస్ , బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటే. బీఆర్ఎస్ విధ్వంసానికి కుట్ర చేసింది. మేము చేసే ర్యాలీలో చొరబడి లేనిపోని కుట్రలు చేయాలనీ భావించారు’’ అని బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


‘‘విద్యార్థులు గో బ్యాక్ అని తరమడంతో బీఆర్ఎస్ నేతలు పారిపోయారు. చర్చలకు ఎవరు మమ్మల్ని పిలవలేదు. అక్కడ పోలీసులు అధికారులతో మాట్లాడారు అంతే. నిరుద్యోగుల పక్షాన అశోక్ నగర్ వెళ్లాం. జీవో నంబర్ 29 ద్వారా తెలంగాణ రిజర్వేషన్లను రద్దు చేసే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు.కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లను అందరికీ అందివ్వాలని భావిస్తోంది. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి వైఖరి ఏందో చెప్పాలి. గ్రూప్ -1 రద్దు చేయాలనీ ఎవరు కోరుకోవడం లేదు. గతంలో బీఆర్ఎస్ పేపర్ లీకులు , ఇతర ఇబ్బందులను సృష్టించింది. పరీక్షలు రద్దు కాదు రీషెడ్యూల్ చేయాలనీ అభ్యర్థులు కోరుకుంటున్నారు. గతంలో సెంట్రల్ లైబ్రరీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చి బీఆర్ఎస్‌ను తిట్టి హామీలు ఇచ్చి వెళ్లారు. అది నమ్మిన నిరుద్యోగులు మాకు వేయాల్సిన ఓట్లు కాంగ్రెస్‌కు వేశారు. సోనియా గాంధీ బలి దేవత కానున్నారు. పోలీసులు విద్యార్థులను వారి తల్లిదండ్రులను బూతులతో తిట్టడం సరికాదు’’ అని బండి సంజయ్ మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Komatireddy: కేటీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డ మంత్రి

CM Chandrababu: అమరావతి రాజధాని నిర్మాణం 2.0 ప్రారంభం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 19 , 2024 | 06:01 PM