Share News

KTR: గ్రూప్-1 అభ్యర్థులను రేవంత్ ప్రభుత్వం హీనంగా చూస్తోంది

ABN , Publish Date - Oct 19 , 2024 | 04:47 PM

కేంద్రమంత్రి బండి సంజయ్, రేవంత్ రెడ్డి కావాలనే డ్రామా ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు.. బండి సంజయ్‌ని పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి మరి రేవంత్ ర్యాలీ చేయిస్తాడని అన్నారు. బీఆర్ఎస్ నాయకులను మాత్రమే రేవంత్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందని మండిపడ్డారు.

 KTR: గ్రూప్-1 అభ్యర్థులను రేవంత్ ప్రభుత్వం హీనంగా చూస్తోంది

హైదరాబాద్: గ్రూప్ -1 అభ్యర్థులను రేవంత్ ప్రభుత్వం కనీసం చర్చలకు కూడా పిలవకపోవడం దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. గ్రూప్-1 అభ్యర్థులను రేవంత్ ప్రభుత్వం హీనంగా చూస్తోందని అన్నారు. ఇవాళ(శనివారం) తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.... గ్రూప్-1 అభ్యర్థులు ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాతలు అని చెప్పారు.


కనీసం సుప్రీంకోర్టు ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకైనా ప్రభుత్వం వేచి చూడాలని అన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డి కావాలనే డ్రామా ఆడుతున్నారని విమర్శించారు.. బండి సంజయ్‌ని పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి మరి రేవంత్ ర్యాలీ చేయిస్తాడని అన్నారు. బీఆర్ఎస్ నాయకులను మాత్రమే రేవంత్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందని మండిపడ్డారు. బండి సంజయ్‌ను చర్చలకు పిలిస్తే ఏం జరుగుతుందని కేటీఆర్ అడిగారు.


బండి సంజయ్ ఏం చదువుకున్నాడు? ఆయనకు పరీక్షల గురించి ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశారు. పరీక్ష పత్రాలు లీక్ చేయమంటే చేస్తాడు... అభ్యర్థుల తరఫున ఆయనేం చర్చిస్తారని నిలదీశారు. రెండు పంటలకు కాదు మూడు పంటలకు రైతు భరోసా ఇస్తానని రేవంత్ రెడ్డి అనలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఒక్క పంట కూడా రైతు భరోసా ఇవ్వకుండా చేతులెత్తేశారని ధ్వజమెత్తారు. మాజీ సీఎం కేసీఆర్ ఈ విషయం గురించి ముందే చెప్పారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతవరకే రైతు బంధు అని చెప్పారని అలాగే జరుగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి రైతు భరోసా ఎందుకు వేయడం లేదని నిలదీశారు. రేపు(ఆదివారం) తెలంగాణవ్యాప్తంగా రైతు భరోసా ఇవ్వనందుకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రకటించారు. రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొనాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి...

Komatireddy: కేటీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డ మంత్రి

CM Chandrababu: అమరావతి రాజధాని నిర్మాణం 2.0 ప్రారంభం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 19 , 2024 | 04:52 PM