Home » Congress
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురు, శుక్రవారం (రెండు రోజులు) దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులపై కేంద్ర మంత్రులకు వినతులు ఇవ్వనున్నారు.
చేతి గుర్తుకు ఓటేస్తే చేతగాని సీఎంను తెలంగాణకు అంటగట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఏడాది కిందట కొలువు దీరిన కాంగ్రెస్ సర్కారు రాష్ట్రాన్ని ఆగం చేసిందని ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఏడాది పాలనలో సాధించిన రాష్ట్ర ప్రగతిపై ఆయన కాంగ్రెస్ అధిష్ఠానానికి సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది.
కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన చర్చలు ఢిల్లీలో మళ్లీ ప్రారంభమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం సాయంత్రం రాహుల్‌గాంధీతో ఇదే అంశంపై మాట్లాడినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ధన్‌కఢ్ చర్యలు భారతదేశ ప్రతిష్టకు భంగకరంగా ఉన్నాయని, ఇది ఆయనపై వ్యక్తిగత పోరాటం ఎంతమాత్రం కాదని బుధవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఖర్గే చెప్పారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలుగుతోందంటే ఆయనే ప్రధాన కారణమని అన్నారు.
AP Jithender Reddy: తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏపీ జితేందర్ రెడ్డి గెలిచారు. ఈ ఎన్నికల గురించి మరింత వివరాలు మీ కోసం..
ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయనపై రాజ్యసభలో విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. చైర్మన్‌పై ఇంతటి తీవ్ర చర్యకు ఎంపీలు దిగడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని చెబుతున్నారు. ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆర్జేడీ, టీఎంసీ, డీఎంకే, సీపీఐ, సీపీఎం, జేఎంఎం, ఆప్ తదితర
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 11 తేదీ నుంచి 13వ తేదీ వరకు రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ముందుగా బుధవారం (11న) రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌కు ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. అక్కడ కొన్ని వ్యక్తిగత పనులు పూర్తి చేసుకున్న అనంతరం ఢిల్లీకి వెళతారు. 12, 13 తేదీల్లో ఢిల్లీ పెద్దలను రేవంత్ రెడ్డి కలవనున్నారు.
ప్రభుత్వాలు మారితే తెలంగాణ తల్లిని మారుస్తారా అని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా(Komirishetti Sai Baba) అన్నారు. ఈ నేల ఆస్తిత్వం, ఆత్మగౌరవంపై ఈ ప్రభుత్వం దాడిచేస్తోందని ఆయన ఆరోపించారు.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.