CM Revanth Reddy: కేంద్ర మంత్రులు, ఏఐసీసీ పెద్దలను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Dec 12 , 2024 | 08:56 AM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురు, శుక్రవారం (రెండు రోజులు) దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులపై కేంద్ర మంత్రులకు వినతులు ఇవ్వనున్నారు.
రాజస్థాన్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గురువారం ఢిల్లీ పర్యటనకు (Delhi Tour) వెళ్లనున్నారు. బుధవారం బందువుల పెళ్లి కోసం సీఎం జైపూర్ (Jaipur) వెళ్లిన విషయం తెలిసిందే. ఈరోజు జైపూర్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళతారు. గురు, శుక్రవారం రెండు రోజులు ఢిల్లీలో పర్యటిస్తారు. ఏఐసీసీ (AICC) పెద్దలను కలవనున్నారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కేంద్ర మంత్రులనూ కలవనున్న సీఎం..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 12, 13వ తేదీ (రెండు రోజులు) దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులపై కేంద్ర మంత్రులకు వినతులు ఇవ్వనున్నారు. కాగా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టితో పాటుగా ఆయా కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించనున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంపైన కేంద్ర పెద్దలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి కేటాయించిన కోటా నిధులు మంజూరు చేయాలని కోరనున్నట్లు సమాచారం.
ఏఐసీసీ పెద్దలను కలిసే అవకాశం..
అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ పెద్దలను కలుస్తారు. ఏడాది పాలనలో సాధించిన రాష్ట్ర ప్రగతిపై ఆయన కాంగ్రెస్ అధిష్ఠానానికి సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు తదితరులతో చర్చలు జరిపిన రేవంత్ రెడ్డి.. ఈ మేరకు సమగ్ర నివేదికను రూపొందించినట్లు సమాచారం. బుధవారం బంధువుల వివాహ వేడుకలో పాల్గొనేందుకు రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా సీఎంకు విమానాశ్రయంలో ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు గోవింద్‌సింగ్, సీఎల్పీ నేత తికారం జల్లి, ఎమ్మెల్యే అమిత్ చరణ్‌లు ఘన స్వాగతం పలికారు. వివాహ వేడుకల అనంతరం అక్కడి నుంచే గురువారం ఢిల్లీ చేరుకోనున్న రేవంత్ రెడ్డి.. ప్రగతి నివేదికలో భాగంగా గ్యారెంటీల అమలుతో పాటు రైతు రుణమాఫీ, సన్నవడ్లకు బోనస్ తదితర పథకాల అమలు, కులగణన.. తదితర అంశాలను అధిష్ఠానానికి వివరించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంత్రివర్గ విస్తరణపైనా అధిష్ఠానం పెద్దలతో చర్చించే అవకాశమున్నట్లు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కొల్లు రవీంద్ర సోదరుని మృతికి సీఎం చంద్రబాబు సంతాపం
జనం మెచ్చేలా! మనం నచ్చేలా పాలన
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News