Share News

Mallikarjun Kharge: ధన్‌ఖడ్‌ ప్రభుత్వ ప్రతినిధి, ప్రజాస్వామ్య పరిరక్షణకే అవిశ్వాసం: ఖర్గే

ABN , Publish Date - Dec 11 , 2024 | 06:22 PM

ధన్‌కఢ్ చర్యలు భారతదేశ ప్రతిష్టకు భంగకరంగా ఉన్నాయని, ఇది ఆయనపై వ్యక్తిగత పోరాటం ఎంతమాత్రం కాదని బుధవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఖర్గే చెప్పారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలుగుతోందంటే ఆయనే ప్రధాన కారణమని అన్నారు.

Mallikarjun Kharge: ధన్‌ఖడ్‌ ప్రభుత్వ ప్రతినిధి, ప్రజాస్వామ్య పరిరక్షణకే అవిశ్వాసం: ఖర్గే

న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌ (Jagdeep Dhankar)పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడాన్ని 'ఇండియా' (INDIA) కూటమి నేతలు సమర్ధించుకున్నారు. చైర్మన్ రాజ్యసభ సమావేశాలు జరక్కుండా అడ్డుకుంటారని, ఆయన ప్రవర్తన దేశ గౌరవానికి భంగం కలిగిస్తోందని ఆక్షేపణ తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తప్పనిసరై ఆయనపై అవిశ్వాస తీర్మానానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. జగ్‌దీప్ ధన్‌ఖడ్‌ "ప్రభుత్వ ప్రతినిధి'' అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) పేర్కొన్నారు.

Rahul Gandhi: ఓం బిర్లాను కలిసిన రాహుల్... అవమానకర వ్యాఖ్యలు తొలగించాలని విజ్ఞప్తి


ధన్‌ఖడ్ చర్యలు భారతదేశ ప్రతిష్టకు భంగకరంగా ఉన్నాయని, ఇది ఆయనపై వ్యక్తిగత పోరాటం ఎంతమాత్రం కాదని బుధవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఖర్గే చెప్పారు. ప్రభుత్వానికి అతిపెద్ద ప్రతినిధిగా చైర్మన్ వ్యవహరిస్తున్నారని, సభా కార్యక్రమాలకు అంతరాయం కలుగుతోందంటే ఆయనే ప్రధాన కారణమని, సభను సజావుగా సాగనీయడం లేదని ఆరోపించారు. 1952 నుంచి ఉపరాష్ట్రపతిని తొలగించమని ఒక్కసారి కూడా విపక్షాలు తీర్మానం చేయలేదన్నారు. ఆ పదవిని నిర్వహించిన వారు నిష్పాక్షికంగా, రాజకీయాలకు అతీతంగా పనిచేయడం, సభా సంప్రాదాయాలకు అనుగుణంగానే కార్యక్రమాలు నిర్వహించడం అందుకు కారణమని చెప్పారు.


కాగా, రాజ్యసభ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానానికి ఎంపీలు దిగడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని చెబుతున్నారు. ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌, ఆర్‌జేడీ, టీఎంసీ, డీఎంకే, సీపీఐ, సీపీఎం, జేఎంఎం, ఆప్‌ తదితర పార్టీలకు చెందిన 60 మంది ఎంపీలు ఆ తీర్మానంపై సంతకాలు చేశారు. కాంగ్రెస్‌ ఎంపీలు జైరాం రమేశ్‌, సయ్యద్‌ నాసిర్‌ హుస్సేన్‌ సదరు తీర్మానాన్ని గత మంగళవారం రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పీసీ మోదీకి అందజేశారు. రాజ్యసభ చైర్మన్‌ ఉపరాష్ట్రపతి కూడా కావడంతో లోక్‌సభలోనూ తీర్మానం ఆమోదం పొందాల్సి ఉంటుంది. అయితే ఈ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానంపై చర్చకు సాంకేతికంగా వీలుపడదని, 14 రోజుల ముందు తీర్మానానికి నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని రాజ్యసభ సచివాలయం సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు రాజ్యసభలో ఎన్‌డీఏకి పూర్తి మెజారిటీ ఉందని, ఈ తీర్మానాన్ని తిరస్కరించడం ఖాయమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి..

Parliament: పార్లమెంట్ సమావేశాలు.. నోటీసులు ఇచ్చిన ఎంపీలు..

CM Stalin: అదానీతో భేటీ అవాస్తవం.. ఆ గ్రూపుతో ఒప్పందాల్లేవ్‌..

For National news And Telugu News

Updated Date - Dec 11 , 2024 | 06:22 PM