Hyderabad: ప్రభుత్వాలు మారితే తెలంగాణ తల్లి మారుతుందా..
ABN , Publish Date - Dec 11 , 2024 | 08:17 AM
ప్రభుత్వాలు మారితే తెలంగాణ తల్లిని మారుస్తారా అని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా(Komirishetti Sai Baba) అన్నారు. ఈ నేల ఆస్తిత్వం, ఆత్మగౌరవంపై ఈ ప్రభుత్వం దాడిచేస్తోందని ఆయన ఆరోపించారు.
హైదరాబాద్: ప్రభుత్వాలు మారితే తెలంగాణ తల్లిని మారుస్తారా అని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా(Komirishetti Sai Baba) అన్నారు. ఈ నేల ఆస్తిత్వం, ఆత్మగౌరవంపై ఈ ప్రభుత్వం దాడిచేస్తోందని ఆయన ఆరోపించారు. బీఆర్‌ఎస్ అధిష్ఠానం పిలుపు మేరకు మంగళవారం గచ్చిబౌలి బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదని తెలంగాణ తల్లి విగ్రహానికి బతుకమ్మను మాయం చేయడం తెలంగాణ ఆస్తిత్వంపై జరుగుతున్న దాడికి పరాకాష్ట అన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నంరాజు, సతీష్ ముదిరాజ్, రాజుముదిరాజ్, జగదీశ్, నారాయణ, శ్రీనివాస్, మధు, ఖాదర్‌ఖాన్, తాహెర్, సయయద్ అజీమ్ పాల్గొన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి..
తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం..
హైదర్‌నగర్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) తెలంగాణ తల్లి విగ్రహ రూపం మార్చినందుకు నిరసనగా ఆల్విన్‌కాలనీ ఎల్లమ్మబండలో కార్పొరేటర్ రోజాదేవి పార్టీ నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.
తెలంగాణ ఉద్యమకారులు, సాహితీవేత్తలు, రచయితలు అందరూ వారి ఊహాల్లో, కవిత్వాల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా చిత్రించిన రూపం, ఉద్యమం నుంచి పుట్టిన రూపం తెలంగాణ తల్లి అన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు, నాయకులు నిమ్మల సంతోష్‌రావు, మాచర్ల భద్రయ్య, పెద్దభాస్కరరావు, సతీష్ రావు, రాములుగౌడ్, ఆంజనేయులు, జగదీ్‌షగౌడ్, యశ్వంత్, వాసు, రవీంద్రరావు, బాబు, కొండల్‌రావు, శేఖర్, రామారావు, ప్రవీణ్, కిరణ్, రామలు, రవి, తదితరులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా?
ఈవార్తను కూడా చదవండి: తినే మాంసంలో.. యాంటీబయాటిక్స్
ఈవార్తను కూడా చదవండి: సింగరేణి సీఎండీ రేసులో శైలజా రామయ్యర్!
ఈవార్తను కూడా చదవండి: ఆన్‌లైన్‌లో భద్రాద్రి ముక్కోటి దర్శన టికెట్లు
Read Latest Telangana News and National News