Share News

CM Revanth Reddy: రాజస్థాన్‌కు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Dec 11 , 2024 | 09:02 AM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 11 తేదీ నుంచి 13వ తేదీ వరకు రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ముందుగా బుధవారం (11న) రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌కు ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. అక్కడ కొన్ని వ్యక్తిగత పనులు పూర్తి చేసుకున్న అనంతరం ఢిల్లీకి వెళతారు. 12, 13 తేదీల్లో ఢిల్లీ పెద్దలను రేవంత్ రెడ్డి కలవనున్నారు.

CM Revanth Reddy: రాజస్థాన్‌కు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరి కాసేపట్లో రాజస్థాన్‌ (Rajasthan)కు వెళ్లనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి సీఎం బయలుదేరనున్నారు. బంధువుల పెళ్లి వేడులకు హాజరయ్యేందుకు జైపూర్‌ (Jaipur)కు వెళ్తున్నారు. గురువారం జైపూర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ (Delhi)కి వెళతారు. 12, 13 తేదీలు.. రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి హస్తినలో పర్యటిస్తారు.


ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలను కలిసే అవకాశం..

కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 11 తేదీ నుంచి 13వ తేదీ వరకు రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ముందుగా బుధవారం (11న) రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌కు ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. అక్కడ కొన్ని వ్యక్తిగత పనులు పూర్తి చేసుకున్న అనంతరం ఢిల్లీకి వెళతారు. 12, 13 తేదీల్లో ఢిల్లీ పెద్దలను రేవంత్ రెడ్డి కలవనున్నారు. రెండ్రోజులపాటు దేశ రాజధానిలో పర్యటించి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులపై కేంద్ర మంత్రులకు వినతులు ఇవ్వనున్నారు.

అలాగే తెలంగాణ రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ, క్యాబినెట్ విస్తరణ తదితర అంశాలపై కాంగ్రెస్ అధిష్ఠానంతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. సీఎంతోపాటు పలువురు మంత్రులూ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. క్యాబినెట్ విస్తరణపై ఆశావహులు ఇప్పటికే ఎదురు చూస్తుండగా.. ఈ అంశం కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. ఈసారైనా దీనిపై స్పష్టత వస్తుందో, లేదో అని కాంగ్రెస్ వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. మరోవైపు సోమవారం (9వ తేదీ) అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా, ఈనెల 16వ తేదీకి సభ వాయిదా పడింది. కాగాసోమవారం రాత్రి మంత్రి సీతక్క ఢిల్లీ వెళ్లారు. మంగళవారం రాహుల్ గాంధీతో మంత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు.


రాహుల్‌తో మంత్రి సీతక్క భేటీ..

sitakka.jpg

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో మంత్రి ధనసరి అనసూయ సీతక్క సమావేశమయ్యారు. మంగళవారం పార్లమెంట్‌ ఆవరణలో రాహుల్‌ గాంధీని కలిసి రాష్ట్ర రాజకీయాలు, ఏడాదిలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఏడాది పాలనపై సీతక్క రాహుల్‌ గాంధీకి వివరించారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ చేయలేని ఎన్నో పనులను ఏడాదిలోనే చేసి చూపించామని చెప్పారు. ప్రజాపాలన విజయోత్సవాలు ఎలా జరిగాయి.. ప్రజల స్పందన ఎలా ఉంది.. వంటి విషయాలను రాహుల్‌ గాంధీ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. జన గణన కార్యక్రమ వివరాలపైనా ఆరా తీశారు. సీతక్క మంత్రిగా ఉన్న పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్థి, మహిళా శిశు సంక్షేమ శాఖల పనితీరుపై రాహుల్‌ గాంధీ సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. అనంతరం పార్లమెంట్‌ ఆవరణలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంక గాంధీని సీతక్క కలిశారు. ఇటీవలే ప్రియాంక వయనాడ్‌ ఎంపీగా గెలిచినందున శుభాకాంక్షలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శిక్షణ తరగతులను బహిష్కరించిన బీఆర్ఎస్

ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం..

మోహన్ బాబు, మనోజ్, విష్ణులకు నోటీసులు

మీడియాపై మోహన్ బాబు చిందులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 11 , 2024 | 09:02 AM