Home » Crime
గార్లదిన్నె మండలం కోటంక గ్రామ సమీపంలోని గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో జరిగిన చోరీ కేసును సీఎస్, గార్లదిన్నె పోలీసులు ఛేదించారు. ఈనెల 20వ తేదీన ఆలయ తాళాలు పగలకొట్టి లోపలికి చొరబడిన దొంగలు స్వామి మూలవిరాట్‌కు ధరింపజేసే రూ.13లక్షల విలువైన 16కిలోల వెండి ఆభరణాలు, 8తులాల బంగారు ఆభరణాలు, రెండు హుండీలు పగలకొట్టి రూ.15వేల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు ఈ ఘటనలో నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు.
పమిడిముక్కల మండలం లంకపల్లి(Lankapally) గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బంగారు ఆభరణాల(Gold Jewellery) కోసం దుండగులు వృద్ధురాలిని హత్య చేశారు. గ్రామానికి చెందిన జ్యోతికృష్ణ(60) అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఇది గమనించిన దొంగలు ఆమె ఇంట్లో చోరీకి యత్నించారు.
నాగార్జునసాగర్ ఆక్స్ఫర్డ్ స్కూల్లో(Oxford School) ఈనెల 23న జరిగిన రెహమాన్(Rahman) హత్య కేసును విజయపురి పోలీసులు(Vijayapuri police) ఛేదించారు. నిందితుడు శివసాయిరెడ్డిగా గుర్తించి అరెస్టు చేసినట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. ఇద్దరి మధ్య గొడవే హత్యకు దారి తీసినట్లు ఆయన వెల్లడించారు.
హైదరాబాద్: నగరంలోని, బేగంపేట పాటిగడ్డలో దారుణం జరిగింది. నలుగురు వ్యక్తులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి చంపారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది.
కృష్ణా జిల్లా: ఉంగుటూరు మండలం, ఆత్కూరు జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. టమాటా లోడుతో వెళుతున్న లారీకి పంచర్ పడింది. దీంతో లారీ టైరు మార్చేందుకు హెల్ప్ చేద్దామని టాటా మ్యాజిక్ డైవర్ వచ్చాడు.
కర్నూలు: ఆలూరు సివిల్ సప్లై గోడౌన్ నుంచి హోలాగుంద మీదుగా కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీని పోలీసులు పట్టుకున్నారు. సివిల్ సప్లై గోడౌన్లో పనిచేసే ఓ ఉద్యోగి రేషన్ దళారులతో కలిసి నకిలీ ఆర్వో బిల్లులతో 122 క్వింటాళ్ల బియ్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
ప్లాట్లకు సంబంధించిన ఓ వివాదం ఒకరి హత్యకు దారితీసింది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ అంబేడ్కర్ నగర్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ గడ్డం మహేశ్‌ను ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
ఫోన్ ద్వారా పరిచయమైన బాలికను గంజాయి మత్తులోకి దింపిన ఓ యువకుడు, తన స్నేహితులతో కలిసి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘోరం బయటపడింది. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
ఏనుగు రోడ్డు దాటే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తిని తొక్కి చంపేసిందని పోలీసులు చెబుతున్నారు. అదేమీ లేదు.. వాహనం ఢీకొని ఆ వ్యక్తి చనిపోయాడని అటవీశాఖ అంటోంది.
హైదరాబాద్: చైన్ స్నాచర్లపై హైదరాబాద్ పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. స్నాచర్లను పట్టుకునే ప్రయత్నంలో గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు. రెండు రోజుల క్రితం చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గాల్లోకి కాల్పులు జరిపారు. తాజాగా సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్నాచర్‌ను పట్టుకోవడం కోసం గాల్లోకి కాల్పులు జరిపారు.