Share News

Crime: హత్య చేసి పోలీసుల ఎదుట లొంగిపోయిన యువకులు..

ABN , Publish Date - Jun 26 , 2024 | 10:51 AM

హైదరాబాద్: నగరంలోని, బేగంపేట పాటిగడ్డలో దారుణం జరిగింది. నలుగురు వ్యక్తులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి చంపారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది.

Crime: హత్య చేసి పోలీసుల ఎదుట లొంగిపోయిన యువకులు..

హైదరాబాద్: నగరంలోని, బేగంపేట (Begumpet) పాటిగడ్డలో దారుణం జరిగింది. నలుగురు వ్యక్తులు ఓ యువకుడిని దారుణంగా హత్య (Murder) చేశారు. కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి చంపారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. తన మరదలిని ప్రేమిస్తున్నాడనే కోపంతో ఉస్మాన్ అనే వ్యక్తిని అజాజ్‌ తన స్నేహితులు ముగ్గురితో కలిసి కత్తితో పొడిచి హతమార్చాడు. ఈ ఘటనలో ఉస్మాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం అజాజ్‌ తన స్నేహితులతో కలిసి పోలీస్ స్టేషన్లో లొంగి పోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు యువకులను విచారిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

విచారణకు రావాలంటూ కేసీఆర్‌కు మరో లేఖ..

టీడీపీ, జనసేనలోకి వైసీపీ కార్పొరేటర్లు?..

కుప్పంలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన..

లోకేష్ ప్రజాదర్బార్‌కు విశేష స్పందన..

YS Jagan: శరణు... శరణు!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 26 , 2024 | 10:52 AM