Share News

Crime News: నాగార్జునసాగర్‌ ఆక్స్‌ఫర్డ్ స్కూల్ హత్య కేసు ఛేదించిన పోలీసులు..

ABN , Publish Date - Jun 26 , 2024 | 08:17 PM

నాగార్జునసాగర్‌ ఆక్స్‌ఫర్డ్ స్కూల్లో(Oxford School) ఈనెల 23న జరిగిన రెహమాన్(Rahman) హత్య కేసును విజయపురి పోలీసులు(Vijayapuri police) ఛేదించారు. నిందితుడు శివసాయిరెడ్డిగా గుర్తించి అరెస్టు చేసినట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. ఇద్దరి మధ్య గొడవే హత్యకు దారి తీసినట్లు ఆయన వెల్లడించారు.

Crime News: నాగార్జునసాగర్‌ ఆక్స్‌ఫర్డ్ స్కూల్ హత్య కేసు ఛేదించిన పోలీసులు..

నల్గొండ: నాగార్జునసాగర్‌ ఆక్స్‌ఫర్డ్ స్కూల్లో(Oxford School) ఈనెల 23న జరిగిన రెహమాన్(Rahman) హత్య కేసును విజయపురి పోలీసులు(Vijayapuri police) ఛేదించారు. నిందితుడు శివసాయిరెడ్డిగా గుర్తించి అరెస్టు చేసినట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. ఇద్దరి మధ్య గొడవే హత్యకు దారి తీసినట్లు ఆయన వెల్లడించారు. శివసాయిరెడ్డి నుంచి హత్యకు వినియోగించిన మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. ఈ మేరకు ఆయన సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు.


అసలేం జరిగిందంటే?

నాగార్జునసాగర్‌లో ఆక్స్‌ఫర్డ్ స్కూల్ నిర్మాణం జరుగుతోంది. పనుల్లో భాగంగా హిల్ కాలనీకి చెందిన సయ్యద్ రెహమాన్ ఎలక్ట్రిషన్‍గా పని చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. అయితే ఈనెల 23న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మండలం ఇన్నిస్ పేటకు చెందిన సిరాపు నాగబాల శివసాయి రెడ్డి అనే వ్యక్తి పాఠశాలలో పెయింటింగ్ పనిలో చేరాడు.

రాత్రి సమయంలో పనులు చేస్తుండగా రెహమాన్, శివసాయి రెడ్డి మధ్య గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరడంతో శివసాయిరెడ్డి తన వద్ద ఉన్న డ్రిల్లింగ్ మిషన్ బిట్టుతో రెహమాన్ తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ప్లాస్టిక్ బ్యాగులో పెట్టిన నిందితుడు.. దాన్ని పాఠశాల ఆవరణలో పూడ్చిపెట్టాడు. అనంతరం అక్కడ్నుంచి పరారయ్యాడు.

Crime News: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పార్కింగ్‌లో మహిళను కత్తితో బెదిరించిన దుండగుడు..


ఈనెల 24న ఉదయం రక్తం కనిపించడం.. ఇద్దరూ కనిపించకపోవడంపై పాఠశాల యాజమాన్యం విజయపురి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. విచారణ చేపట్టిన పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం నిందితుడి కోసం బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. పెద్దవూర వై జంక్షన్ వద్ద శివసాయి రెడ్డి ఉంటున్నట్లు సమాచారం రావడంతో వెంటనే వెళ్లి నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో రెహమాన్‌ను తానే చంపినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. దీంతో శివసాయిరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇది కూడా చదవండి:

Hyderabad: జీహెచ్ఎంసీ అధికారులపై ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ ఆగ్రహం..

Updated Date - Jun 26 , 2024 | 08:17 PM