Share News

Ration Rice: అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీని పట్టుకున్న పోలీసులు

ABN , Publish Date - Jun 25 , 2024 | 07:41 AM

కర్నూలు: ఆలూరు సివిల్ సప్లై గోడౌన్ నుంచి హోలాగుంద మీదుగా కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీని పోలీసులు పట్టుకున్నారు. సివిల్ సప్లై గోడౌన్‌లో పనిచేసే ఓ ఉద్యోగి రేషన్ దళారులతో కలిసి నకిలీ ఆర్వో బిల్లులతో 122 క్వింటాళ్ల బియ్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

Ration Rice: అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీని పట్టుకున్న పోలీసులు

కర్నూలు: ఆలూరు సివిల్ సప్లై గోడౌన్ (Civil Supply Godown) నుంచి హోలాగుంద (Holagunda) మీదుగా కర్ణాటకకు (Karnataka) అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీని (Rice lorry) పోలీసులు (Police) పట్టుకున్నారు. సివిల్ సప్లై గోడౌన్‌లో పని చేసే ఓ ఉద్యోగి రేషన్ దళారులతో కలిసి నకిలీ ఆర్వో బిల్లులతో 122 క్వింటాళ్ల బియ్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ దందా వెనుక ఓ రెవెన్యూ అధికారి ఉన్నట్లు సమాచారం. రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై అధికారులు విచారిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. తరచూ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. కొందరు అవినీతిపరులు అక్రమార్కులకు అండగా నిలవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కొందరు అక్రమార్కులు వ్యాపారుల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకొని చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో రేషన్ బియ్యం పక్కదారిపడుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

కల్కి సినిమా టికెట్ రేట్లు పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతి

జగన్‌ రక్షణకు 986 మంది!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 25 , 2024 | 07:42 AM