Home » CS Shanti Kumari
తెలంగాణ(Telangana)లో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ(IPS transfer) అయ్యారు. 28మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పాలనాపరమైన ప్రక్షాళనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం భారీఎత్తున బదిలీలు చేపట్టింది.
తెలంగాణతో పాటు గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షాలు (Heavy Rains) పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (CS Shantikumari) సంబంధిత అధికారులతో నేడు(శుక్రవారం) రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (Telangana Formation Day) సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జూన్2వ తేదీన రాష్ట్ర ద్విశాబ్ధి ముంగిపు వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. జూన్ 2న ఉదయం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించనున్నారని, అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.
తెలంగాణ(Telangana) సెక్రటేరియట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాహుల్ అనుమానాస్పద మరణం నేపథ్యంలో మిగతా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సీఎస్ శాంతి కుమారిని కలిసి న్యాయం చేయాలని సెక్రటేరియట్ ఉద్యోగులు కోరారు. అయితే అసలు రాహుల్ ఎలా మృతి చెందాడు. ఏంటి విషయం అనేది ఇప్పుడు చుద్దాం.
మూసీ పరివాహక ప్రాంతం సుందరీకరణపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ప్రత్యేకంగా దృష్టి సారించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో ఉన్న సబర్మతి నది తరహాలో తీర్చిదిద్దేలా ప్రణాళికలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే ఇటీవల మూసీ నది సుందరీకరణపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి.. వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన విషయం తెలిసిందే.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(CS Shantikumari) అధికారులను కోరారు. సోమవారం నాడు తెలంగాణ సచివాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలోని రిజర్వాయర్లలో సరిపడా నీరు ఉన్నందున ప్రస్తుత వేసవికాలంలో తాగునీటి అవసరాలకు ఏవిధమైన ఇబ్బందులు లేవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (CS Shanti Kumari) స్పష్టం చేశారు. తాగునీటి సరఫరా పరిస్థితులపై సంబంధిత శాఖల అధికారులతో నేడు(మంగళవారం) సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
నగరంలోని పబ్లిక్ గార్డెన్స్‌లో ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ( CS Shanti Kumari ) బుధవారం డా.బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
తెలంగాణ ప్రభుత్వానికి, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డీజీపీ రవిగుప్తాకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ( NHRC ) నోటీసులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లాలోని ఇంజినీరింగ్ కాలేజ్‌లో జనవరి 5వ తేదీన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు ఇచ్చింది.