Share News

Shantikumari: గ్రేటర్‌లో కంటోన్మెంట్‌ ప్రాంతాల విలీనానికి సిద్ధం..

ABN , Publish Date - Jun 26 , 2024 | 10:38 AM

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో సాధారణ ప్రజలు నివసించే ప్రాంతాలను గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ)లో విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(Shantikumari) కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు.

Shantikumari: గ్రేటర్‌లో కంటోన్మెంట్‌ ప్రాంతాల విలీనానికి సిద్ధం..

- కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో సాధారణ ప్రజలు నివసించే ప్రాంతాలను గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ)లో విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(Shantikumari) కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. కంటోన్మెంట్‌ బోర్డుల పరిధిలోని ప్రాంతాలను మున్సిపాలిటీల్లో విలీనం చేసే అంశంపై కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి ఎ.గిరిధర్‌ న్యూఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల ఉన్నతాధికారులతో మంగళవారం వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పాల్గొన్న సీఎస్‌ శాంతికుమారి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కేంద్ర మంత్రికి తెలియజేశారు. బ్రిటిష్‌ పాలన నుంచి దేశంలో కొనసాగుతున్న కంటోన్మెంట్‌ బోర్డులను రద్దు చేయాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉందని కేంద్ర మంత్రి గిరిధర్‌(Union Minister Giridhar) ఈ సందర్భంగా తెలిపారు.

ఇదికూడా చదవండి: Minister Ponnam Prabhakar: బోనాలకు సమన్వయంతో పనిచేయాలి..


అందువల్ల విలీన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్రాలను కోరారు. ఇందుకు స్పందించిన సీఎస్‌ శాంతికుమారి మాట్లాడుతూ.. కేంద్ర ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమ్మతి తెలిపిందని వివరించారు. కంటోన్మెంట్‌ పరిధి నుంచి సాధారణ ప్రజలు నివసించే ప్రాంతాలు(సివిల్‌ ఏరియా) తొలగింపు విధివిధానాల ఖరారుకు కేంద్రం ఏర్పాటుచేసిన కమిటీ రాష్ట్ర ప్రభుత్వంతో ఇంకా చర్చించలేదని తెలిపారు. విలీన ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కలిసి పని చేస్తున్నదని చెప్పారు. మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్‌, మున్సిపల్‌, కంటోన్మెంట్‌ బోర్డు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 26 , 2024 | 10:38 AM