Home » Damodara Rajanarasimha
జీవో 317 వల్ల అన్యాయం జరిగిన వారిని గుర్తించి, వివరాలను త్వరలోనే అందజేయాలని మంత్రివర్గ ఉప సంఘం అధికారులను ఆదేశించింది.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటలైజ్డ్ వైద్య సేవల కేంద్రంగా అంకుర ఆస్పత్రిని తీర్చిదిద్దినట్లు అంకుర హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్ పున్నం తెలిపారు.
నిర్జీవమైన ఫుడ్ సేఫ్టీ వ్యవస్థను ప్రజా ప్రభుత్వం సమూల ప్రక్షాళన మంత్రి దామోదర రాజ నరసింహ (Minister Damodara Raja Narasimha) తెలిపారు. కొత్తగా ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం 17 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులను నియమించిందని అన్నారు.
బీజేపీ అభ్యర్థులకు సరితూగే అభ్యర్థులు లేకపోవడం వల్లే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు కొన్నిచోట్ల ప్రతికూల ఫలితాలు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తన నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు లోక్‌సభ ఎన్నికలలో శాయశక్తులా పోరాడాయని చెప్పారు.
సీజనల్ వ్యాధులు, పాముకాటు నివారణ మందులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Damodar Raja Narasimha) అధికారులను ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో "తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్" (TGMSIDC) అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్‌లో నిర్మితమవుతున్న నాలుగు టిమ్స్(తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆస్పత్రుల ఎత్తును 14 అంతస్తులకే పరిమితం చేశామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, మార్పు, చేర్పులపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చేదెవరు..? ఉన్న మంత్రుల శాఖల మార్పు గురించి వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కీలక అప్ డేట్ ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణ ఉంటుందని.. కొందరి మంత్రుల శాఖల మారుతాయని తేల్చి చెప్పారు. మంత్రివర్గంలోకి ముగ్గురి నుంచి నలుగురిని తీసుకునే అవకాశం ఉంటుందని వివరించారు.
తెలంగాణను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పేర్కొన్నారు. వైద్య రంగాన్ని విస్తరించాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ హాస్పిటల్‌ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
రాష్ట్రంలోని ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఉండాలని, తదనుగుణంగా చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. గురువారం నుంచి యథావిఽధిగా విధులకు హాజరు కానున్నారు. ఈ విషయాన్ని జూడాలు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమక్షంలో ప్రకటించారు. దీంతో రెండురోజులుగా జూడాలు చేస్తున్న ఆందోళనకు తెరపడింది.