Home » Delhi High Court
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీ చేసిన ఆరోపణలను ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తోసిపుచ్చారు.
దేశ రాజధాని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని కోరుతూ పదే పదే పిటిషన్లు దాఖలు అవుతుండటంపై ఢిల్లీ హైకోర్టు బుధవారం అసంతృప్తి వ్యక్తం చేసింది.
లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట దక్కలేదు. లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మంగళవారంనాడు కొట్టివేసింది. అరెస్టు తర్వాత ఈడీ రిమాండ్ చట్టవిరుద్ధం కాదని, ఢిల్లీ సీఎంను ఈడీ అరెస్టు చేయడం చట్టనిబంధనలకు విరుద్ధం కాదని కోర్టు స్పష్టం చేసింది.
దేశ రాజధాని దిల్లీ ( Delhi ) లో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఐదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థిని ఆరో తరగతికి ప్రమోట్ చేయడానికి పాఠశాల నిరాకరించంది. దీంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు.
మధ్యం కుంభకోణంకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు న్యాయస్థానం తిరస్కరించింది.
లిక్కర్ స్కామ్‌కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రిగా తొలగించాలని దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.
ఢిల్లీ హైకోర్టులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్ట్, ఈడీ రిమాండ్‌ను సవాల్ చేస్తూ శనివారం నాడు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ వెంటనే విచారించాలని కేజ్రీవాల్ కోరారు. కేజ్రీవాల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
CM Kejriwal: దేశ రాజధాని ఢిల్లీ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఓవైపు సీఎం కేజ్రీవాల్(CM Kejriwal).. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు(ED).. పరిస్థితి తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో(Delhi Liquor Scam Case) సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేస్తుందని గట్టి ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. కేజ్రీవాల్ కీలక నిర్ణయం..
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణకు రావాలంటూ సీఎం కేజ్రీవాల్ ( Kejriwal ) కు ఈడీ తొమ్మిదో సారి సమన్లు జారీ చేసింది. దీనిని తీవ్రంగా తీసుకున్న ఆప్ అధినేత హైకోర్టును ఆశ్రయించారు. తనకు జారీ చేసిన అనేక సమన్లను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. మనీలాండరింగ్ కింద తనకు ఇంతవరకూ జారీ చేసిన సమన్లను ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారంనాడు ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ జరుపనుంది.