Share News

Delhi Liquor Scam: కవిత బెయిల్ కేసులో కేసీఆర్ ప్రస్తావన జరగలేదు..!

ABN , Publish Date - May 28 , 2024 | 09:23 PM

దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఢిల్లీ హైకోర్టులో జరిగిన బెయిల్ విచారణలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావన వచ్చిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

Delhi Liquor Scam: కవిత బెయిల్ కేసులో కేసీఆర్ ప్రస్తావన జరగలేదు..!

న్యూ ఢిల్లీ/హైదరాబాద్: దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Case) అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఢిల్లీ హైకోర్టులో జరిగిన బెయిల్ విచారణలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావన వచ్చిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై కవిత న్యాయవాది మోహిత్ రావు స్పందించారు. కవిత బెయిల్ కేసులో ఈడీ కేసీఆర్ ప్రస్తావన చేసిందన్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఈడీ వాదనల్లో ఎక్కడా కేసీఆర్ ప్రస్తావన జరగలేదని.. ఎక్కడా కూడా కేసీఆర్ పేరు కూడా రాయలేదని తేల్చి చెప్పారు.


Mohith-Rao.jpg

కోర్టులో అసలేం జరిగింది..?

బెయిల్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా మాగుంట రాఘవరెడ్డి వాంగ్మూలాన్ని మాత్రమే ఈడీ ప్రస్తావించిందని మోహిత్ రావు స్పష్టం చేశారు. ఆయనతో పాటు మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరు కూడా ప్రస్తావన చేయడం జరిగిందన్నారు. మాగుంట రాఘవ తన వాంగ్మూలంలో తన తండ్రి శ్రీనివాసులురెడ్డి కి లిక్కర్ కేసులో ఉన్న వారిని పరిచయం చేశానని చెప్పారన్న విషయాన్ని ఈడీ.. కోర్టుకు తెలిపింది. అయితే.. ఏమీ జరగకున్నా కొందరు కావాలనే కేసీఆర్ పేరు వచ్చిందని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఒకింత మోహిత్ మండిపడ్డారు.

Mohit-Rao-Clarity.jpg

Updated Date - May 28 , 2024 | 09:27 PM