Delhi High Court: లిక్కర్ స్కాం కేసు.. ఈడీ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు నేడు
ABN , Publish Date - Jun 25 , 2024 | 06:42 AM
లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆప్ కన్వీనర్, సీఎం కేజ్రీవాల్‌కు(CM Arvind Kejriwal) ఊరట దక్కలేని విషయం విదితమే. కేజ్రీవాల్ పిటిషన్‌ను జూన్ 26వ తేదీన విచారిస్తామని జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్‌తో కూడిన వెకేషన్ బెంచ్ సోమవారం వెల్లడించింది.
ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆప్ కన్వీనర్, సీఎం కేజ్రీవాల్‌కు(CM Arvind Kejriwal) ఊరట దక్కలేని విషయం విదితమే. కేజ్రీవాల్ పిటిషన్‌ను జూన్ 26వ తేదీన విచారిస్తామని జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్‌తో కూడిన వెకేషన్ బెంచ్ సోమవారం వెల్లడించింది. అయితే అప్పటి వరకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చే ఆదేశాల కోసం వేచి చూస్తామని స్పష్టం చేసింది.
ఇదే సమయంలో కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను వ్యతిరేకిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది. బెయిల్ ఉత్తర్వు అమలును ఈ నెల 21న జస్టిస్ సుధీర్‌కుమార్ జైన్ నేతృత్వంలోని ధర్మాసనం నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. ధర్మాసనం ఆదేశాల మేరకు ఇరుపక్షాలు తమ వాదనలను లిఖితపూర్వకంగా సోమవారం సమర్పించాయి. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తీర్పు వెలువడే అవకాశం ఉంది.
మార్చి 21వ తేదీన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే ఇటీవల ఢిల్లీలోని ట్రయల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కేజ్రీవాల్ బెయిల్ రద్దు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఈడీ ఆశ్రయించింది. ఆ క్రమంలో తమ వాదనలు పూర్తిగా వినకుండానే ట్రయల్ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసిందంటూ ఢిల్లీ హైకోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది.
తమ వాదనలు పూర్తిగా వినాలని.. అలాగే కేజ్రీవాల్ బెయిల్ రద్దు చేయాలని ఆ పిటిషన్‌లో ఈడీ స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై రెండు మూడు రోజుల్లో స్పందిస్తామని ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. అయితే అప్పటి వరకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై స్టే విధిస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఆదేశాల కోసం వేచి చూస్తామని.. అలాగే జూన్ 26వ తేదీన ఈ పిటిషన్‌ను విచారిస్తామని సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ పేర్కొంది. దాంతో సుప్రీంకోర్టులో సైతం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఊరట దక్కనట్లు అయింది.
For Latest News and National News click here